విరాట్ కోహ్లీపై కేసు నమోదు బెంగళూరు పోలీసులు..

విరాట్ కోహ్లీ( Virat Kohli ).ఈ పేరు గురించి ప్రపంచంలో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.

క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల మిషన్ కు మారుపేరుగా ఈ పేరు నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించడం అతడికి అలవాటే.

ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తాజాగా టి20 2024 వరల్డ్ కప్( T20 2024 World Cup ) విజేతగా నిలిచిన టీమ్ ఇండియా తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

దీంతో యావత్ ప్రపంచ విరాట్ కోహ్లీ అభిమానులు నిరాశకు గురయ్యారు.ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబంతో ఇంగ్లాండులో గడుపుతున్నాడు.

తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై పోలీస్ కేస్ నమోదయింది.బెంగళూరు ( Bengaluru )మహానగరంలో ఉన్న విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ లో నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.రూల్స్ ప్రకారం.కొద్ది సమయం వరకు పబ్ లు నిర్వహించాల్సి ఉండగా అంతకుమించి పబ్బులను నడిపినట్లుగా సమాచారం.సోమవారం రాత్రి 1:30 వరకు పబ్ ను నడిపారని.అందుకుగాను.

, వన్ 8 కమ్యూన్ పబ్ తో( One8 Commune )పాటు నగరంలోని మరో నాలుగు పబ్ ల పైన కూడా ఈ కేసులు నమోదయాయని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

మహానగరంలో పబ్బు లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉండేందుకు అనుమతి ఉండగా.ఆపై కూడా తెరిచి ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా విరాట్ కోహ్లీకి చెందిన పబ్ లో మ్యూజిక్ ను ఎక్కువ సౌండ్ తో ప్లే చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఇదివరకు అందాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.

చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందొ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube