బాహుబలి సినిమాలో జక్కన్న ఫేవరెట్ రోల్ ఇదే.. ఆ పాత్ర అంటే ఇంత ఇష్టమా?
TeluguStop.com
టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి.
కాగా ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి.అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత జక్కన్నదే అని చెప్పాలి.
రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన సినిమాలో బాహుబలి సినిమా కూడా ఒకటి.
"""/" /
ఈ సినిమా ఆయన క్రేజ్ ని పెంచడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ లో చాటి చెప్పింది.
రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ కోసం రాజమౌళి నిర్మాతల చేత ఏకంగా నాలుగు వందల కోట్లు ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు.
ఆ సంగతి అటు ఉంచితే మొదట ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి కాస్త వెనుకడుగు వేశారట.
ఆ సమయంలో ప్రభాస్ రాజమౌళికి అండగా నిలిచారట.కాగా బాహుబలి సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
"""/" /
వీటన్నింటిలో దేవసేన పాత్ర ( Devasena )అంటే రాజమౌళికి ఎంతో ఇష్టమట.
ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు దర్శకుడు రాజమౌళి.ఇకపోతే జక్కన్న సినిమాల విషయానికి వస్తే.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాతో తెలుగు సినిమాకియా అనే మరింత పెంచుతాడని, తప్పకుండా ఆ సినిమా సంచలన విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.
బెగ్గర్ సినిమాతో పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం వస్తుందా.. లక్ష్యాన్ని సాధించాలంటూ?