వైరల్ వీడియో: ఇన్నాళ్లు ఎక్కడున్నావు సామీ.. అంపైరింగ్ అదరకొడుతున్నాడుగా..

2024 టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా( Team India ) ప్రస్తుతం జింబాబ్వే( Zimbabwe ) పర్యటనలో ఉంది.అయితే జింబాబ్వే పర్యటనలో టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని సభ్యులు కాకుండా మిగతా సభ్యులతో మ్యాచులు ఆడుతుంది.

 Funny Umpire Doing Crazy Acts In Cricket Ground Video Viral Details, Viral Video-TeluguStop.com

ఈ సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచులు జరగగా మొదటి మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది.తర్వాత రెండో మ్యాచ్లో 100 పరుగుల భారీ విజయాన్ని టీమిండియా అందుకుంది.

ఇకపోతే మ్యాచ్ ఏదైనా సరే.ఏ దేశం వారైనా సరే మ్యాచ్ జరగాలంటే., కచ్చితంగా ఫీల్డ్ లో అంపైర్స్ ( Umpires ) ఉండాల్సిందే.

గ్రౌండ్ లో కేవలం క్రీడాకారులు మాత్రమే కాకుండా ఒక అంపైర్ కూడా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.అతని పని మ్యాచ్లో చాలా కీలకమైంది.ఆటగాళ్లు అవుట్ అయినా, నోబాల్ వేసిన, వైడ్ బాల్ వేసిన ఏదైనా సరే అతడు కన్ఫామ్ చేసిన తర్వాతనే స్కోరుబోర్డులో మార్పు కనిపిస్తుంది.

ఇకపోతే తాజాగా ఓ అంపైర్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.క్రికెట్ గ్రౌండ్లో( Cricket Ground ) తన హావాభావాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

మామూలుగా అంపైర్లు కాస్త ఇంటర్నేషనల్ లెవెల్ లో వారి స్టైల్లో అంపైరింగ్ చేసిన.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం అంపైర్ వారికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు.

తాజాగా ఓ వీడియోను సూరత్ టెన్నిస్ క్రికెట్ అనే ఇంస్టాగ్రామ్ ఖాత ద్వారా ఓ వీడియో పంచుకుంది.ఇందులో కనిపిస్తున్న అంపైర్ చాలా విభిన్న శైలిలో కనిపిస్తున్నాడు.గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతుందో తెలియక ఒకవైపు ఆటగాళ్లు, మరోవైపు అభిమానులు అతనిని గమనిస్తూ ఉండిపోతున్నారు.సిక్స్, ఫోర్, వికెట్ పడినప్పుడు లేదా వైడ్ బాల్ పడినప్పుడు ఇలా ఏ సంఘటన ఏదైనా సరే చాలా చిత్ర విచిత్రంగా డాన్స్ చేస్తూ సిగ్నల్స్ ఇస్తున్నాడు.

ఒకసారి నడుము ఊపుతూ.మరోసారి ఎక్ససైజ్ చేస్తున్నట్లుగా.చేస్తూ అవసరమైన సిగ్నల్స్ ఇస్తున్నాడు.ప్రస్తుతం ఈ క్రేజీ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇతడని అర్జెంటుగా ఐసిసికి రెఫర్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube