ఆ హీరోయిన్ విషయంలో బండ్ల గణేష్ పై మండిపడిన పవన్.. ఏమైందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో బండ్ల గణేష్( Bandla Ganesh ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ గా సినిమాలలో నటించేవారు అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు.

 Bandla Ganesh Interesting Comments About Pawan Kalyan Details,pawan Kalyan,bandl-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ ఎలాంటి సినిమాలను నిర్మించకపోయిన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.ఇక బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పాలి అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు.

Telugu Bandla Ganesh, Gabbar Singh, Shruti Haasan, Pawan Kalyan, Pawankalyan, Sh

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే బండ్ల గణేష్ కు విపరీతమైన అభిమానం.ఆయనని ఏకంగా దైవ సమానంగా భావిస్తూ ఉంటారు.ఇక పవన్ కళ్యాణ్ తన పట్ల ఏ విధంగా వ్యవహరించిన బండ్ల గణేష్ పెద్దగా పట్టించుకోరు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిగా ఉన్నటువంటి ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ ఒక హీరోయిన్ విషయంలో తనని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

Telugu Bandla Ganesh, Gabbar Singh, Shruti Haasan, Pawan Kalyan, Pawankalyan, Sh

పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్( Gabbar Singh ) సినిమాకు నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో పవన్ కళ్యాణ్ తనని తిట్టినట్లు తెలిపారు.ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్( Shruthi Hassan )ని ఎంపిక చేశారు అయితే ఆమెను తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆమెకు అప్పటివరకు వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి అలాగే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా వినిపించాయి.

అందుకే ఆ అమ్మాయిని వద్దని నేను చెప్పాను.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నీకు ఎన్ని హిట్లు పడ్డాయి రా అంటూ నన్ను అరచడమే కాకుండా ఆ అమ్మాయిని ఫైనల్ చేసేసేయండి అంటూ చెప్పారు.

అలా శృతిహాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో భాగం కావడం ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవడం జరిగింది అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube