నక్క నా జోలికొస్తుంది... వదల ముసలిను అంటూ వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) ప్రస్తుతం రవితేజ( Raviteja ) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.నిజానికి ఈయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి చేయాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Harish Shankar Gives Strong Warning To Somebody Else Post Goes Viral Details, Ha-TeluguStop.com

ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకున్న పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.ఈ తరుణంలోనే రవితేజతో మరో సినిమాకు కమిట్ అయ్యారు మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా షూటింగ్ పనులను ఇతర పనులను శర వేగంగా కొనసాగిస్తున్నారు.ఇక ఈ సినిమా గురించి తరచూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవుతూ వస్తున్నాయి.అయితే ఇలాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు మేకర్స్ స్పందిస్తూ వచ్చారు.అయితే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.

అయితే ఈయన ఒక జర్నలిస్టును( Journalist ) దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పోస్ట్ పై స్పందిస్తూ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ స్పందిస్తూ.రిలీజ్ దగ్గర పడుతుంది కదా, ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది.

దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది అయితే ఫలానా వ్యక్తిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు కానీ ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube