వైరల్ వీడియో: ఇంజినీరింగ్‌ కాలేజ్‌ క్యాంటీన్‌ చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్న ఎలుక..

తాజాగా సంగారెడ్డి జిల్లాలోని( Sangareddy District ) చౌటుకూరు మండలం సుల్తాన్ పూర్ దగ్గరలోని జెఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ( JNTU Engineering College ) క్యాంటీన్ లో ఓ చట్నీ గిన్నెలో ఎలుక( Rat ) అటు ఇటు తిరుగుతూ స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా కనబడుతుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

 Live Rat Found In Chutney Of Jntuh College Boys Hostel Canteen Video Viral Detai-TeluguStop.com

ఎలుక చెట్ని గిన్నెలో అటు ఇటు తిరగడాన్ని వీడియో తీసి విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త బయటపడింది.బాయ్స్ హాస్టల్ క్యాంటీన్లో( Boys Hostel Canteen ) ఈ సంఘటన చోటు చేసుకుంది.

చట్నీ గిన్నెపై పెట్టకపోవడం వల్ల ఎలుక అందులోకి ప్రవేశించి ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతుంది.ఈ విషయం సంబంధించి తాజాగా కొందరు ప్రజా ప్రతినిధులు అక్కడికి వెళ్లి విద్యార్థుల నుంచి ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో హాస్టల్ క్యాంటీన్లో ఎలుక సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు.అయితే ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై కలగజేసుకోవడంతో ప్రిన్సిపల్ చట్నీ పాత్రలో ఎలక పడలేదని.

ఆ ఎలుక శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో కనిపించిందని తెలిపారు.ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు తప్పుదోవ పట్టించేలా వీడియో తీసి వైరల్ చేసినట్లు ఆయన వాపోయారు.అయితే ఈ విషయం సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.ఈ విషయంలో పలువురు ప్రజాప్రతినిధులు కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడి అసలు విషయాన్ని తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube