వైరల్ వీడియో: ఇంజినీరింగ్‌ కాలేజ్‌ క్యాంటీన్‌ చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్న ఎలుక..

తాజాగా సంగారెడ్డి జిల్లాలోని( Sangareddy District ) చౌటుకూరు మండలం సుల్తాన్ పూర్ దగ్గరలోని జెఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ( JNTU Engineering College ) క్యాంటీన్ లో ఓ చట్నీ గిన్నెలో ఎలుక( Rat ) అటు ఇటు తిరుగుతూ స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా కనబడుతుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఎలుక చెట్ని గిన్నెలో అటు ఇటు తిరగడాన్ని వీడియో తీసి విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త బయటపడింది.

బాయ్స్ హాస్టల్ క్యాంటీన్లో( Boys Hostel Canteen ) ఈ సంఘటన చోటు చేసుకుంది.

"""/" / చట్నీ గిన్నెపై పెట్టకపోవడం వల్ల ఎలుక అందులోకి ప్రవేశించి ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతుంది.

ఈ విషయం సంబంధించి తాజాగా కొందరు ప్రజా ప్రతినిధులు అక్కడికి వెళ్లి విద్యార్థుల నుంచి ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో హాస్టల్ క్యాంటీన్లో ఎలుక సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు.

అయితే ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై కలగజేసుకోవడంతో ప్రిన్సిపల్ చట్నీ పాత్రలో ఎలక పడలేదని.

"""/" / ఆ ఎలుక శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో కనిపించిందని తెలిపారు.

ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు తప్పుదోవ పట్టించేలా వీడియో తీసి వైరల్ చేసినట్లు ఆయన వాపోయారు.

అయితే ఈ విషయం సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

ఈ విషయంలో పలువురు ప్రజాప్రతినిధులు కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడి అసలు విషయాన్ని తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజమౌళి ఈగ సినిమాలో ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?