నన్ను స్టార్‌ హీరోను చేసింది తెలుగు వాళ్లే.. కమల్ హాసన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2( Indian 2 ) లేక ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో జులై 12న గ్రాండ్గా విడుదల కానుంది.

 Kamal-haasan-emotional Words About Tollywood People, Kamal Haasan, Siddharth, Em-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి.ఇక సినిమా విడుదల తేదికి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

Telugu Indian, Kamal Haasan, Siddharth, Telugu, Tollywood-Movie

కాగా ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నువ్వు నిర్వహించారు.ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కమల్ హాసన్( Kamal Haasan ) మాట్లాడుతూ.తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ ను చేశారు.తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి.

భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజం లోంచి వచ్చినట్టే ఉంటాయి.రెండు వేళ్లు మడత పెట్టడం అంటే ఒకటి ఓటు వేసేది.

రెండోది మన బాధ్యతది చెప్పేది.

Telugu Indian, Kamal Haasan, Siddharth, Telugu, Tollywood-Movie

సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు.అవన్నీ ఇందులో ఉంటాయి.కానీ డిఫరెంట్‌గా ఉంటాయి.

నేను గురువు అని సిద్దార్థ్ ప్రతీ సారి చెబుతుంటాడు.అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెబుతుండేవాడిని.

సిద్దార్థ్, నేను ఒక ఏకలవ్య శిష్యులం.ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి.

సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి.ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.

భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ చూడండి.ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి.

అందుకోసం మీడియా మాకు సహకరించాలి అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube