షాకింగ్ వీడియో: అసలు ఆ పాముకు ఏం చెప్పవయ్యా బాబు.. అలా దొరికేసింది..

మనలో పాములంటే చాలామందికి భయం.పాము కొద్ది దూరంలో ఉంది అంటే చాలు.

 Snake Catcher Catch The Snake Viral On Social Media, Viral Video, Snake Video,-TeluguStop.com

అటువైపు కూడా కన్నెత్తి చూడకుండా దూరంగా వెళ్ళిపోతాము.మరికొందరైతే పాములను పెంపుడు జంతువుల లాగా ఇంట్లోనే ఉంచి వాటితో ఆడుకుంటూ.

, వాటితో పాటు పడుకోవడం లాంటి సంఘటనలకు సంబంధించి వీడియోలు చాలానే చూసాము.ఇకపోతే కొందరు పాములను పట్టుకోవడంలో దిట్ట.

కేవలం మగవారు మాత్రమే కాకుండా.ఆడవారు కూడా ఈ పాములు పట్టడంలో ఆరితేరిపోయారు కొందరు.

అయితే అక్కడక్కడ ఇళ్లలోకి గాని, ఏదైనా వ్యాపార సంస్థల్లోకి కానీ పాములు చొరబడినప్పుడు అలాంటి స్నేక్ క్యాచర్లను పిలిపించి వాటిని పట్టుకొని సుదూర ప్రాంతాలలో వదిలిపెట్టిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము.తాజాగా ఓ స్నేక్ క్యాచర్( Snake Catcher ) విషపూరితమైన కింగ్ కోబ్రాను ఏదో హిప్నోటిజం చేసినట్లుగా చేసి చివరికి పట్టుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

వీడియోలో కనిపిస్తున్న మనిషిని చూస్తే ఆ ఘటన ఆఫ్రికా( Africa ) దేశాలలో జరిగినట్లుగా అర్థమవుతుంది.వీడియోలో అతనితోపాటు నల్లగా, పసుపు పచ్చని చారలతో ఉన్న నాగుపాము కనబడుతుంది.అది కూడా బుసలు కొడుతూ ఎవరైనా దొరుకుతె కాటు వేయడానికి రెడీగా ఉన్నట్లుగా కనబడుతుంది.అయితే ఆ స్నేక్ క్యాచర్ మాత్రం ఆ పాముతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఆ పాము దగ్గరికి చేరుకున్నాడు.

అతడు చిన్నగా పాముతో ఏదో మాట్లాడుతున్నట్లుగా.నోట్లో నుంచి కొద్దికొద్దిగా పొగను వదులుతూ పాము తల దగ్గరికి తన కుడి చేతితో పాము తలను నిమురుతూ ఉండడం కనిపిస్తుంది.

అలా ఆ పాము అతడి ఆధీనంలో వచ్చినట్లుగా గ్రహించిన అతడు వెంటనే ఆ చేత్తోనే పాము తలని ఒక్కసారిగా అధమి పట్టుకున్నాడు.దీంతో ఆ పాము ఒక్కసారిగా గిలగలలాడడం మొదలు పెడుతుంది.

దీంతో వీడియో ముగుస్తుంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.అసలు పాముతో ఏం చెప్పావ్ భయ్యా.అలా నీ మాట వినిందని కొందరు అంటుంటే.నీకు ఏమైనా జంతువులకు సంబంధించి హిప్నాటిజం చేసే అలవాటు ఏమైనా ఉందా అంటూ మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube