కొత్త జంటకు ఖరీదైన విల్లాను బహుమతిగా ఇచ్చిన అంబానీ.. ఎన్ని రూ.కోట్లంటే?

అనంత్ అంబానీ – రాధిక మర్చంట్. ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.

 Mukesh And Nita Ambani Gift Edavilla In Dubai To Their Son Details, Mukesh Amban-TeluguStop.com

ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఎక్కడ చూసినా కూడా వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గురించి చర్చించుకుంటున్నారు.కనివిని ఎరుగని రీతిలో అతిథులకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖేష్ అంబానీ.

( Mukesh Ambani ) కొడుకు పెళ్లి కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఈ పెళ్లికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల అధినేతలతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్న విషయం తెలిసిందే.

Telugu Villa Gift, Ambani, Anant Ambani, Anantambani, Dubai, Gift, Mukesh Ambani

ఇక ఎప్పటికప్పుడు ముఖేష్ అంబానీ అలాగే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో వారు వేసుకున్న దుస్తులు చెప్పులు ఇలా ప్రతి ఒక్క విషయంలో వార్తలు నిలుస్తూనే ఉన్నారు.ఆ సంగతి అటు ఉంచితే తాజాగా ముఖేష్ అంబానీ చేసిన పనికి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.కొడుకు పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ దాదాపుగా 640 కోట్లు విలువ చేసే ఖరీదైన కానుకను గిఫ్ట్ గా ఇచ్చాడట ముఖేష్ అంబానీ.ముఖేష్- నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Merchant ) జంట‌కు దుబాయ్‌లో( Dubai ) ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారని వార్తలు రావ‌డం ఎవ‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు.

అనంత్, రాధికలకు దుబాయ్‌లోని పామ్ జుమేరాలో అత్యంత ఖ‌రీదైన‌, విలాసవంతమైన విల్లాను కానుక‌గా ఇచ్చారు.

Telugu Villa Gift, Ambani, Anant Ambani, Anantambani, Dubai, Gift, Mukesh Ambani

ఈ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీకి దాదాపు రూ.640 కోట్లు ఖర్చయిందని అంచనా.ఇది దాదాపు 76 మిలియన్ డాల‌ర్లు.

సుమారు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ( Villa ) దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాపర్టీలలో ఒకటిగా పేరుగాంచింది.విల్లా స్పెసిఫికేషన్స్ ఏమిటి? అంటే ఈ భవనంలో 10 విశాలమైన బెడ్‌రూమ్‌లు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, సంపన్నమైన ఇంటీరియర్స్ ఉన్నాయి.ఈ ఇంటిని అద్భుత‌మైన‌ కళాకృతుల‌తో డిజైన్ చేసారు.ఇటాలియన్ పాలరాయి, డిజైన‌ర్ షీల్డ్స్ తో అలంకరించిన ఇల్లు ఇది.

ఇందులో ఒక‌ ప్రైవేట్ పూల్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుందట.అనంత్ అంబానీ ప్రీవెడ్డింగుల కోసం ఇప్ప‌టికే 1500 కోట్లు ఖ‌ర్చు చేసిన అంబానీలు మ‌రో 500 కోట్ల రూపాయ‌ల‌ను పెళ్లి వేడుక కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంచ‌నా.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సెల‌బ్రిటీలంతా అంబానీల ప్రీ వెడ్డింగుల్లో పాల్గొనబోతురు.ఇప్పుడు పెళ్లి వేడుక‌లోను భారీగా సెల‌బ్రిటీలు పాల్గొంటున్నారు.సంగీత్ వేడుక‌తో ఇప్ప‌టికే కోలాహాలం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.జూలై 12న అనంత్ అంబానీ రాధికా మ‌ర్చంట్ ల వివాహం జ‌ర‌గ‌నుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube