ఆ ఒక్క వ్యక్తి లేకపోవడం తో అష్టకష్టాలు పడుతున్న డైరెక్టర్ శంకర్

తమిళ దర్శకుడు శంకర్( Director Shankar ) భారతదేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యాడు.ఈ దర్శకుడు జెంటిల్మెన్, జీన్స్, ఇండియన్, అపరిచితుడు, రోబో వంటి హిట్ సినిమాలు తీసి టాప్ ఇండియన్ డైరెక్టర్లలో ఒకరిగా అవతరించాడు.

 Director Shankar Facing Problems Details, Shankar, Director Shankar, Writer Suja-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా ఆయన ఒక పెద్ద హిట్టు కూడా కొట్టలేకపోయాడు.విక్రమ్‌ తో కలిసి తీసిన ఐ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

ఒకప్పుడు శంకర్ మూవీ వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తే వారు.ఆయన మూవీలో గ్రాఫిక్స్ వేరే లెవెల్ ఉండేది.

కథ కూడా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ శంకర్ మార్క్ అనేది కనిపించడం లేదు.

రాజమౌళి, సుకుమార్, నాగ్‌ అశ్విన్, ప్రశాంత్‌ నీల్, అట్లీ వంటి దర్శకులు మంచి కథలతో దూసుకుపోతుంటే శంకర్ చాలా వెనకబడిపోయారు.

దానికి కారణం S.రంగరాజన్( S.Rangarajan ) అనే ప్రముఖ రచయిత చనిపోవడమే అని తెలుస్తోంది.సుజాత అనే మారుపేరు ద్వారా ఈయన తమిళంలో నవలలు రాశారు.

తమిళ సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు.శివాజీ, బాయ్స్, ఇండియన్, రోబో వంటి శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు డైలాగులు రాశారు.

అతను 2008, ఫిబ్రవరి, 27న చనిపోయే ముందు శంకర్ డైరెక్టోరియల్ ఎంథిరన్‌లో పనిచేశారు.

Telugu Shankar, Screenwriter, Shankarsujatha, Shanker, Writer Sujatha, Writersuj

శంకర్ తీసిన చాలా సినిమాల కథల చర్చల్లో సుజాత( Sujatha ) పాల్గొనేవారు.కథ ఎఫెక్టివ్ గా వచ్చేలాగా సలహాలు ఇచ్చేవారు.ఆయన చెప్పిన సూచనలను పరిగణలోకి తీసుకుంటూ అతను సరి దిద్దేవారు శంకర్.

ఆ విధంగా సినిమాలు ఆయన వల్ల చాలా ఎఫెక్టివ్‌గా వచ్చాయి.సుజాత చనిపోయాక శంకర్ కథను బాగా రాసుకోలేకపోయారు.

ఒక మెయిన్ కాన్సెప్ట్ అయితే రాయగలిగే వారు కానీ దానిని అద్భుతంగా మార్చడంలో ఫెయిల్ అయ్యేవారు.అందుకే ఇటీవల కాలంలో శంకర్‌ నుంచి వచ్చే సినిమాల్లో మునుపటి మార్క్ కనిపించడం లేదు.

సుజాతలేని లోటు ఆయనకు బాగా తెలుస్తోందట.

Telugu Shankar, Screenwriter, Shankarsujatha, Shanker, Writer Sujatha, Writersuj

స్టోరీ డిస్కషన్ కోసం చాలామంది మేధావులను కూర్చోబెడుతున్నాడట కానీ ఇంతకుముందు లాగా అనుకున్నట్టు కథలు అద్భుతంగా రావడం లేదని తెలుస్తోంది.ఈ రచయిత చనిపోవడమే శంకర్ కెరీర్ కు పెద్ద శాపమైనట్లు కోలీవుడ్ లో చాలామంది మాట్లాడుకుంటున్నారు.మరి శంకర్ గతంలో ఆయన ఉంటే ఎలాంటి సలహాలు ఇచ్చేవారో ఊహించుకొని అవి వర్కౌట్ అవుతాయో లేదో అంచనా వేసుకొని ముందుకు సాగితే మునుపటిలాంటి హిట్స్ కొట్టొచ్చు.

ఓల్డ్ మ్యాజిక్ ను క్రియేట్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube