ఫలించిన మోడీ దౌత్యం.. దిగొచ్చిన పుతిన్, ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న భారతీయులకు విముక్తి

ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇటీవలి కాలంలో భారతీయులతో( Indians ) పాటు అన్ని దేశాల వాసులు విదేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.వీరి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

 Russia To Release Indians Fighting In Ukraine War After Modi-putin Talks Details-TeluguStop.com

ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.కన్సల్టెన్సీలు, ట్రావెల్, వీసా సేవలు, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్ తదితర వ్యాపార సంస్థలు ప్రతి చోటా కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి.

వీటిలో ప్రభుత్వ గుర్తింపు వున్న సంస్థలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.మిగిలినవన్నీ భోగస్ సంస్థలే.

Telugu Indian, Indians, Modi Putin, Moscow, Primenarendra, Russia, Russian, Russ

ఈ క్రమంలో కొందరు భారతీయ యువకులను ఏజెంట్లు బలవంతంగా రష్యా ఆర్మీలో( Russian Army ) చేరుస్తున్నారు.దీంతో వీరంతా ఉక్రెయిన్( Ukraine ) యుద్ధంలో పాల్గొంటూ ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.ఇప్పటికే పలువురు భారతీయులు ఈ యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) రంగంలోకి దిగారు.

వీరందరినీ విడిచిపెట్టేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై( Vladimir Putin ) ఒత్తిడి తీసుకొచ్చారు.

Telugu Indian, Indians, Modi Putin, Moscow, Primenarendra, Russia, Russian, Russ

రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ.సోమవారం రష్యా రాజధాని మాస్కో( Moscow ) చేరుకున్నారు.ప్రధాని గౌరవార్ధం పుతిన్.

నిన్న రాత్రి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో( Russia – Ukraine War ) పాల్గొంటున్న భారతీయుల కష్టాలను పుతిన్ దృష్టికి తీసుకెళ్లారు మోడీ.

దీనిపై సానుకూలంగా స్పందించిన రష్యా అధ్యక్షుడు.వారిని విధుల నుంచి తప్పించి భారత్‌కు పంపుతామని హామీ ఇచ్చినట్లుగా కథనాలు వస్తున్నాయి.

కాగా .ఉక్రెయిన్ యుద్ధంలో బలవంతంగా పనిచేస్తున్న భారతీయుల వ్యవహారం అప్పట్లో వెలుగులోకి రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి రష్యా అధికారులతో చర్చలు జరిపింది.ఈ క్రమంలోనే పలువురిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇంకా పదుల సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube