సింగపూర్ : ఆశ్రయం కల్పిస్తానని అత్యాచారం.. భారత సంతతి యజమానికి 13 ఏళ్ల జైలు

17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన బార్ యజమానికి సింగపూర్ కోర్ట్( Singapore Court ) సోమవారం 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది.నిందితుడిని రాజ్ కుమార్ బాలా (42)గా( Raj Kumar Bala ) గుర్తించారు.

 Indian-origin Singaporean Jailed For Raping 17 Year Old Runaway Girl Details, In-TeluguStop.com

అత్యాచారం, వేధింపులకు పాల్పడటం, పారిపోయిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం వంటి అభియోగాలను అతనిపై మోపినట్లు ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది.అయితే బెయిల్ పెండింగ్ అప్పీల్ ప్రకారం తన క్లయింట్‌ను రిలీజ్ చేయాలని డిఫెన్స్ లాయర్ రమేష్ తివారీ మీడియాతో అన్నారు.

ఫిబ్రవరి 2020లో సింగపూర్ బాలికల వసతి గృహం( Singapore Girls Home ) నుంచి పారిపోయినప్పుడు బాధితురాలికి 17 ఏళ్లు.ఈ క్రమంలో లిటిల్ ఇండియా ఆవరణలోని హోటళ్లు, మోటళ్లు, తినుబండారాల దుకాణాలు ఉండే డన్‌లప్ స్ట్రీట్‌లోని బాలాస్ డాన్ బార్ అండ్ బిస్ట్రోలో( Bala’s Don Bar and Bistro ) ఉద్యోగావకాశం ఉందని అక్కడ పనిచేస్తున్న మరొకరి ద్వారా బాధితురాలు తెలుసుకుంది.

బాధితురాలు ఇంటర్వ్యూ కోసం బార్‌కి వెళ్లి.బాలాను కలిసింది.ఈ సందర్భంగా నిందితుడు ఆమెకు కస్టమర్‌లకు సేవ చేయడం, డ్రింక్స్ తయారు చేయడం సహా ఎలాంటి పనులు చేయాలో వివరించాడు.అలాగే బార్‌లో పనిచేసే ఇతరులతో కలిసి బస చేయవచ్చని కూడా ఆమెకు చెప్పాడు.

Telugu Balasdon, Bar, Young, Dunlop Street, Indianorigin, Jailed, Raj Kumar Bala

ఈ నేపథ్యంలో బాధితురాలు కొన్ని రోజులు బార్‌లో పనిచేసింది.అయితే పరారీలో ఉన్న వ్యక్తుల గురించి పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో వారు ఫిబ్రవరి 22, 2020న దాడి చేశారు.పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు మరో అమ్మాయితో కలిసి పారిపోయింది.అయితే వీరిని నిందితుడు బాలా పట్టుకుని తను నివసించే ప్రదేశానికి తీసుకెళ్లాడు.అనంతరం ముగ్గురూ కలిసి పీకల దాకా మద్యం సేవించారు.బాధితురాలు మత్తులో ఉన్న సమయంలో బాలా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మరో బాలికతోనూ అతను లైంగిక చర్యలకు దిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

Telugu Balasdon, Bar, Young, Dunlop Street, Indianorigin, Jailed, Raj Kumar Bala

బాధితురాలు బాలా నుంచి తప్పించుకుని జూలై 2020న తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.తనపై అత్యాచారం జరిగినట్లు ఆగస్ట్ 2020లో తన కేస్ వర్కర్లతో చెప్పింది.బాధితురాలు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లుగా బాలాకు తెలుసునని.

డబ్బు సంపాదించడానికి, ఆశ్రయం పొందేందుకు ఆమె అతనిపై ఆధారపడిందని కోర్టు పేర్కొంది.దీనితో పాటు బాలా మరో ఐదుగురు బాధితులకు సంబంధించి మరో 22 పెండింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నాడు.

వీటిలో లైంగిక నేరాల అభియోగాలు కూడా ఉన్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube