వైరల్ వీడియో: కారు పార్కింగ్‌ చేస్తుండగా 30 అడుగుల ఎత్తు నుంచి కారుతోపాటు పడిపోయిన మహిళ..

హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh ) లోని సోలన్‌ పట్టణంలో మహిళ కార్ డ్రైవ్ చేస్తుండగా అద్భుతప్పి ఏకంగా 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.మహిళ ఓ గుంత చివరన కార్ పార్కింగ్ చేద్దామని ప్రయత్నిస్తుండగా.

 Viral Video: A Woman Fell From A Height Of 30 Feet While Parking A Car , Viral V-TeluguStop.com

అదుపుతప్పి అది కాస్త 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోయింది.ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటన సమయంలో పక్కనే ఉన్న మరో ఇంటిలో ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోమవారం నాడు జరిగిన ఈ ఘటనలో మహిళ పార్కింగ్ కోసం రివర్స్ చేస్తుండగా కారు ఒక్కసారిగా అద్భుతప్పిపోయింది.దీంతో ఎంత ప్రయత్నించిన ఆవిడ కారును అదుపు చేయలేక 30 మీటర్ల లోతైన గుంతలో పడి తీవ్రంగా గాయపడింది.బోల్తా పడిన కారు పూర్తిగా ధ్వంసం కాగా.

ఆ మహిళకు మాత్రం గాయాలయ్యాయి.

కారు గుంతలో పడుతున్న సమయంలో పెద్ద శబ్దం విన్న అక్కడి స్థానికులు ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి కిందకు కారు పడిపోవడాన్ని గమనించారు.వెంటనే అక్కడ ఉన్న ప్రజలు కారు వద్దకు చేరుకొని తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఇక ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు అక్కడ ఉన్న ప్రజలకు కొండ ప్రాంతాల్లో వాహనాలు నడపడం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube