జగన్ నాకు చాలా మంచి మిత్రుడు.. నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు నిర్మాత అశ్వినీ దత్( Aswini Dutt).వైజయంతి మూవీస్ బ్యానర్ ని స్థాపించిన ఈయన గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.

 Aswini Dutt Sensational Comments On Ys Jagan Mohan Reddy Details,ys Jagan Mohan-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ఇటీవల కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

Telugu Aswini Datt, Kalki, Kalki Ad, Prabhas, Ashwini Dutt, Ysjagan-Movie

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కి వైయస్ జగన్( YS Jagan ) గురించి ఒక ప్రశ్న ఎదురయింది.ఇంత పెద్ద సినిమా ప్రాజెక్టును పెట్టుకొని ఎన్నికలకి ముందు బలంగా మీ వాదనను ఎలా వినిపించారని రిపోర్టర్ ప్రశ్నించారు.

Telugu Aswini Datt, Kalki, Kalki Ad, Prabhas, Ashwini Dutt, Ysjagan-Movie

ఈ ప్రశ్నకు అశ్వినీ దత్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) విషయంలో తాను ఎక్కడా డిఫర్ అవ్వలేదు అన్నారు.నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఆయన నాకు చాలా మంచి మిత్రుడు అని తెలిపారు.

మా రెండో అమ్మాయి పెళ్లి వేడుకలలో కూడా జగన్ పాల్గొన్నారని వారి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు ఏ విధమైనటువంటి మేలు చేయలేదన్న కారణంతో ఆయనపై అశ్వినీ దత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఇక కల్కి 2 ( Kalki 2 ) గురించి కూడా మాట్లాడుతూ దాదాపు షూటింగ్ పూర్తి అయిందని వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube