ఇది ఒక యాంటీ వైరస్ లాంటిది... ఎమోషనల్ అయిన నటుడు సిద్ధార్థ్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సిద్ధార్థ్ ( Siddharth) త్వరలోనే భారతీయుడు 2 ( Barateeyudu 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధానపాత్రలో నటించిన సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి మనకు తెలిసిందే.

 Siddharth Emotional Comments At Barateeyudu 2 Press Meet, Siddharth, Kamal Hassa-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా జులై 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ చేరుకొని ఇక్కడ కూడా వరుస ఇంటర్వ్యూలకు ప్రెస్ మీట్లకు హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Barateeyudu, Jayasudha, Kamal Hassan, Kollywood, Siddharth-Movie

ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ్ గురించి కమల్ హాసన్( Kamal Hassan) జయసుధ ( Jayasudha ) చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ తాను,సిద్ధార్థ్ ఏకలవ్య శిష్యులం అని, తమకు కనిపించని గురువు ఉంటారని, తాము ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే మంచి స్టూడెంట్స్‌ అని కమల్ హాసన్ చెప్పారు.ఇలా కమల్ హాసన్ తన గురించి మాట్లాడటంతో ఈయన కంటతడి పెట్టుకున్నారు.

Telugu Barateeyudu, Jayasudha, Kamal Hassan, Kollywood, Siddharth-Movie

అనంతరం జయసుధ కూడా సిద్ధార్థ్ ను కమల్ హాసన్ వంటి గొప్ప నటుడితో పోల్చి మాట్లాడటంతో ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇక వీరి తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా అని తెలిపారు.సమాజంలో ఉన్న ఈ కరప్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది.భారతీయుడు 2 అనేది ఓ యాంటీ వైరస్ లాంటిది.సమాజంలోని వైరస్‌ను తీసేందుకు శంకర్ గారు తీసుకొచ్చిన అప్డేటెడ్ యాంటి వైరస్ ఈ చిత్రమని తెలిపారు.

ఇక నాకు కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టం అలాంటి గొప్ప నటుడితో జయసుధ గారు నన్ను పోల్చడం విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube