మంచు హీరోల మధ్య గొడవలు నిజమేనా.. అలా చేస్తే మాత్రమే ఈ వార్తలు ఆగుతాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) తన అద్భుతమైన నటనతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

 Rumours Goes Viral About Differences Between Manchu Heroes Details, Manchu Manoj-TeluguStop.com

మోహన్ బాబు వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ సక్సెస్ కాగా వాళ్లు కోరుకున్న భారీ విజయాలు మాత్రం దక్కలేదనే చెప్పాలి.అయితే మంచు హీరోల మధ్య గ్యాప్ ఉందని చాలా సందర్భాల్లో వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా మనోజ్ కూతురు( Manoj Daughter ) బారసాల వేడుక గ్రాండ్ గా జరగగా కూతురుకు దేవసేన శోభ ఎం.ఎం.( Devasena Shobha M.M ) అనే పేరును ఫిక్స్ చేశారు.అయితే బారశాలకు విష్ణు( Manchu Vishnu ) హాజరు కాకపోవడం, ఇన్విటేషన్ నోట్ లో కూడా విష్ణు పేరు లేకపోవడం గురించి తెలిసిందే.ఈ విధంగా జరగడం వల్ల మనోజ్, విష్ణు మధ్య గ్యాప్ పెరగడమే తప్ప తగ్గడం జరగదు.

విష్ణు, మనోజ్ గొడవలు పడితే మంచు ఫ్యామిలీకే నష్టమని చెప్పవచ్చు.

కుటుంబం అన్న తర్వాత ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.విష్ణు, మనోజ్ లలో ఈ విషయానికి సంబంధించి ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే మంచిది.మరోవైపు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో( Kannappa ) నటిస్తుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా ప్లస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మనోజ్ సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.మంచు హీరోలు కలిసి కనిపిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలు ఆగుతాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube