పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తాజాగా విడుదలైన సినిమా కల్కి.ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
అలాగే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో నటించారు.గత నెల అనగా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతోపాటు ఇప్పుడు 1000 కోట్లకు దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇంతటి విజయం సాధించడంతో సెలబ్రిటీలు సామాన్యులు ప్రభాస్ పై అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అలాగే నేషనల్ లెవల్ లో ఆయన మంచి గుర్తింపు దక్కించుకున్నారు అశ్విన్.ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన కల్కి సినిమాకు అన్ని సెంటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు సినీ ప్రియులు.
అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.అయితే రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతున్నా కూడా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది కల్కి.
ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )కూడా ఈ సినిమా పట్ల స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.కల్కి2898AD… నా మనసును కదిలించింది జస్ట్ వావ్! నాగ్ అశ్విన్ మీ భవిష్యత్తు దృష్టికి హ్యాట్సాఫ్.ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం అంటూ మహేష్ పొగడ్తలతో ముంచెత్తారు.
అనంతరం అమితాబ్ బచ్చన్ గురించి స్పందిస్తూ.అమితాబ్ బచ్చన్ సర్.
మీ మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ సాటిలేనిది. కమల్ హాసన్ సర్( Kamal Haasan ) మీరు పోషించే ప్రతి పాత్ర ప్రత్యేకమే.
ప్రభాస్ మీరు మరో గొప్ప సినిమాను ఈజీగా చేసేశారు.దీపిక పదుకొనె ఎప్పటిలాగే అద్భుతం.
కల్కితో అద్భుత విజయం సాధించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ తోపాటు మొత్తం టీమ్ కు అభినందనలు అని మహేష్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.