వైకల్యం ఉన్నా కష్టపడి డాక్టర్.. క్యాన్సర్ రోగులకు ఫ్రీ వైద్యం.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వైకల్యం ఉన్నవాళ్లు లక్ష్యాలను సాధించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.అయితే వాటిని అధిగమించి సక్సెస్ సాధించే వాళ్లు కొంతమందే ఉంటారు.

 Nanda Inspirational Success Story Details Inside Goes Viral In Social Media ,d-TeluguStop.com

వైకల్యం వల్ల ఆమె డాక్టర్ కావాలనే కలలకు సైతం బ్రేకులు పడ్డాయి.అయితే ఆయుర్వేదంలో అడుగుపెట్టి ఎన్నో పరిశోధనలు చేసి తన సక్సెస్ తో డాక్టర్ నందా( Dr Nanda ) ప్రశంసలు అందుకున్నారు.

సొంతంగా ట్రస్ట్ స్థాపించి డాక్టర్ నందా క్యాన్సర్ రోగులకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు.

Telugu Cerebral Palsy, Dr Nanda, Inspirational, Kerala, Story-Inspirational Stor

కేరళ రాష్ట్రం( Kerala )లోని కొల్లంకు చెందిన నందా తల్లి టీచర్ కాగా తండ్రి ఉద్యోగం చేస్తున్నారు.మధ్యతరగతి కుటుంబంలో నందా జన్మించగా ఆమెకు ఆరు నెలల వయస్సు ఉన్న సమయంలోనే సెరిబ్రల్ పాల్సీ( Cerebral palsy ) అనే అరుదైన సమస్యతో బాధ పడుతున్నట్టు తేలింది.ఈ సమస్య వల్ల నందా బాల్యం నుంచి బలహీనంగా ఉండేది.

మూడు నాలుగు సర్జరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది.నాలుగేళ్లు నిండే సరికి నందా నడవడమే కష్టమైంది.</br

Telugu Cerebral Palsy, Dr Nanda, Inspirational, Kerala, Story-Inspirational Stor

చెల్లెలు నమిత పుట్టిన తర్వాత చెల్లితో కలిసి ఆమె స్కూల్ లో చేరారు.చిన్నప్పుడే డాక్టర్ అయ్యి పేదలకు వైద్య సేవలు అందించాలని కలలు కన్నానని ఆమె పేర్కొన్నారు.ఎంబీబీఎస్ లో చేరడానికి వెళ్తే అడ్మిషన్ సమయంలో వైకల్యం ఉందని అర్హత లేదని నిరాశపరిచారని నందా అన్నారు.18వ ఏట పింక్ హార్ట్ ఛారిటబుల్ ట్రస్ట్( Pink Heart Charitable Trust ) స్థాపించానని నందా వెల్లడించడం గమనార్హం.నేషనల్ ఆయుష్ మిషన్ లో థైరాయిడ్, నెలసరి సమస్యలపై పరిశోధనలు చేశానని నందా వెల్లడించారు.విమర్శలు, హేళనలు ఎదురైనా కష్టపడి ఈ స్థాయికి చేరానని ఆమె వెల్లడించారు.

నందా తన ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.నందా సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

నందా టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube