తెలంగాణ ( Telangana ) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది.అలాంటి టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు సీఎం కేసీఆర్.
ఈసారి బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలోనే తెలంగాణలో బరిలోకి దిగనుంది కెసిఆర్ టీం.ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 115 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ను ప్రకటించి వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను గద్దె దించాలని ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి కంకణం కట్టుకొని కూర్చున్నాయి.ఆ విధంగానే కేసీఆర్ ( KCR ) వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి.
ఇదే తరుణంలో మూడు సభలు, ఆరు స్పీచ్ లు లాగా కదులుతున్నాయి అన్ని పార్టీలు.ఇక సెప్టెంబర్ 17వ తేదీ చాలా ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 17న ఓవైపు కాంగ్రెస్ సభ, మరోవైపు అమిత్ షా ( Amith sha ) సభ నిర్వహించారు.ఇక కాంగ్రెస్ సభ తుక్కుగూడలో నిర్వహిస్తే లక్షలాది మంది జనాలు తరలివచ్చి సభ సక్సెస్ అయింది.
కానీ బిజెపి సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చినా కానీ, సభ సక్సెస్ కాలేక పోయింది.దీనికి కారణాలేంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గత రెండు పర్యాయాలు తెలంగాణలో బిజెపి ( BJP ) అంటే తెలియదు.నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కావు.2018 ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే సీట్లు, కేవలం చేతివేళ్ల సంఖ్యకి పరిమితమైంది.అలాంటి బిజెపికీ బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది.
ఇక బీఆర్ఎస్ కు ప్రత్యాన్మయం అనే స్థాయికి వచ్చింది.ఈ టైంలోనే బిజెపిలో ఈటెల రాజేందర్ ( Etela ajender ) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరారు.
ఆ తర్వాత బిజెపిలో వర్గాలు ఏర్పడ్డాయి.ఈ వర్గాల మధ్య వచ్చిన పోరు ఢిల్లీ అధిష్టానం వరకు చేరింది.
చివరికి బండి సంజయ్ ( Bandi Sanjay ) ని అధ్యక్షుడిగా తొలగించారు.ఇక అప్పటినుంచి బిజెపి క్యాడర్ లో జోష్ తగ్గిందని చెప్పవచ్చు.
అంతేకాకుండా బిజెపి నుంచి పోటీ చేసే అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బిజెపి రాష్ట్ర కమిటీ.కానీ ఈ దరఖాస్తుల్లో కీలకమైన నేతలు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.

అంతేకాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amith sha )సభకు కూడా కనీస జనాలు కూడా రాకపోవడం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని చెప్పవచ్చు.రెండు నుంచి మూడు నెలల్లో ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో వికసించాల్సిన కమలం పువ్వు, బోసిపోయి కనిపిస్తోంది.అంతేకాకుండా అమిత్ షా ( Amith sha ) సభ కూడా అంతంతమాత్రంగానే జరగడంతో అమిత్ షా నిరాశకులోనైనట్టు తెలుస్తోంది.మరి చూద్దాం ఈ రెండు మూడు నెలల్లో కేంద్రం ఏమైనా కొత్త వ్యూహం రచించి గ్రాఫ్ పెంచుతుందా.
లేదంటే తెలంగాణలో బిజెపికి స్థానం లేదని వదిలేస్తుందా అనేది ముందు తెలుస్తుంది.