'హాయ్ నాన్న' ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్.. ఎప్పుడంటే?

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరికొత్త మూవీ ”హాయ్ నాన్న” ( Hi Nanna )ఎప్పుడు డిఫరెంట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి మంచి సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దీంతో ఈయన కొత్త ప్రాజెక్ట్ మీద కూడా అప్పుడే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

 Time Locked For Nani's Hi Nanna Musical Update, Nani, Hi Nanna , Musical Bla-TeluguStop.com

మరి నాని ప్రజెంట్ ఒక సినిమా చేస్తున్నాడు.

దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని( Nani ) నెక్స్ట్ తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.”హాయ్ నాన్న” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మ్యూజికల్ అప్డేట్ వచ్చింది.మ్యూజిక్ ప్రమోషన్స్ ను ఈ రోజు నుండి స్టార్ట్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు.ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు మ్యూజికల్ బ్లాస్ట్ అంటూ తెలిపారు.

మరి ఫస్ట్ సింగిల్ గురించే ఈ అప్డేట్ అని తెలుస్తుంది.చూడాలి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Kiara Khanna ) కీ రోల్ పోషిస్తున్నారు.

వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే డిసెంబర్ 21న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube