పాక్ పై భారత్ ఘనవిజయం..సరికొత్త రికార్డులు సృష్టించిన భారత ఆటగాళ్లు..!

తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ అర్ధ సెంచరీలతో చెలరేగిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కు రిజర్వ్ డే లో జరిగింది.రిజర్వు డేలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్( Virat Kohli ) సెంచరీలతో చెలరేగి చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

 India's Great Victory Over Pakistan..indian Players Created New Records , India-TeluguStop.com

దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు నమోదు చేసింది.

అనంతరం భారీ లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్ ( Pakistan)జట్టు కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి.వరుసగా వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు 32 ఓవర్లలో 128 పరుగులు చేసి 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.విరాట్ కోహ్లీ 94 బంతులలో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 122 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

దీంతో విరాట్ కోహ్లీ 267 వన్డేలలో 13 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.ఈ సెంచరీ తో విరాట్ కోహ్లీ 47వ సెంచరీ పూర్తిచేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.106 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 111 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.భారత జట్టు బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో 25 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లను తీసి పాకిస్తాన్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.బుమ్రా, పాండ్యా, శార్థూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయింది.

బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, కేల్ రాహుల్.బౌలింగ్లో కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) అద్భుత ఇన్నింగ్స్ ప్రదర్శించడం వల్ల పాకిస్తాన్ చిత్తుగా ఓడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube