సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు కొచ్చి ఎన్ఐఏ అధికారులు సమన్లు జారీ చేశారు.కేరళలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆదిలింగం పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ కు అధికారులు సమన్లు ఇచ్చారని తెలుస్తోంది.
కాగా ఆదిలింగం గతంలో వరలక్ష్మీకి ఏపీగా పని చేశారు.డ్రగ్స్ సరఫరాలో వచ్చిన నగదు మొత్తాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టినట్లుగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు.
ఈ క్రమంలో ఆదిలింగం గురించి వివరాలను తెలుసుకునే క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కు సమన్లు జారీ చేశారని సమాచారం.ప్రస్తుతం ఆదిలింగం ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నారని తెలుస్తోంది.