సూపర్ స్టార్ రజిని కాంత్( Rajinikanth ) అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.ఆయన తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ లతో కలిసి నటించారు.
శ్రీదేవి, శ్రీవిద్య వంటి సీనియర్ యాక్టర్స్ దగ్గర మొదలు పెట్టి నగ్మా, మీనా తరువాత శ్రేయ, నయనతార…ఇప్పుడు తమన్నా, కీర్తి సురేష్( Keerthy Suresh ) వరకు.ఇలా అన్ని జెనెరేషన్ల హీరోయిన్స్ తో కలిసి నటించిన ఘనత కేవలం రజిని కాంత్ సొంతం.
ఐతే అప్పట్లో శ్రీదేవి రజినీకాంత్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది.

వీళ్ళను వెండి తెర మీద చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు.వీళ్లిద్దరి కలిసి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో మొత్తంగా 22 సినిమాల్లో నటించారు.వాటిలో గాయత్రీ (1977), పతినారు వాయతినిలే (1977) వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయ్.
ఐతే తెర మీద మాత్రమే కాకుండా, తెర వెనుక కూడా వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది అప్పట్లో.ఒకసారి రజినీకాంత్ కి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరితే శ్రీదేవి 5 రోజులు అన్నం మానేశారట.
వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో.

రజిని పెళ్లికి ముందు తరచూ శ్రీదేవి( Sridevi ) ఇంటికి వెళ్తుండేవారు.శ్రీదేవి అప్పటికే కమల్ హాసన్( Kamal Haasan ) తో ప్రేమలో పడి మోసపోయి బాధలో ఉంది.ఆ సమయంలో రజిని కాంత్ తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానం చూసి రజిని తనను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారట శ్రీదేవి.
ఆ విషయాన్నీ ఒకసారి అడిగేశారట.కానీ రజినీకాంత్ తనకు ఎప్పుడు ఆ ఉద్దెశం లేదని, కానీ ఆమె ఒప్పుకుంటే ఆమె చెల్లిని పెళ్లి చేసుకుంటానని శ్రీదేవితో అన్నారట.
ఈ మాట విని శ్రీదేవి తట్టుకోలేకపోయిందట.తనతో సాన్నిహిత్యం గా ఉంటూ తన చెల్లిని పెళ్లి చేసుకుంటా అనడం ఆమె సహించలేకపోయింది.అప్పటినుంచి రజిని కాంత్ ని దూరం పెట్టిందట.ఈ సంఘటన తరువాత వారిద్దరి మధ్య దూరం పెరిగిందని చెప్పుకుంటారు సినీ ప్రజలు.