రాజన్న సిరిసిల్ల:రెడ్డి సామాజికవర్గం అభివృద్ధి కోసం రెడ్డి కార్పొరేషన్( Reddy Corporation ) ఏర్పాటు చేసుకోవాలని అలాగే సిరిసిల్లలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహ ఏర్పాటుకు రెడ్డిలంతా ఐక్యంగా ఉండి కృషి చేద్దామని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి పిలుపునిచ్చారు.రెడ్డిల ఆరాధ్యుడు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 154 వ జయంతి వేడుకల్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల లహరి గార్డెన్లో రామిరెడ్డి( Ramireddy ) జయంతి వేడుకల్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూర అంజిరెడ్డి మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయ సాధన దిశగా ప్రతి రెడ్డి కులస్తుడు ముందుకు సాగాలని అప్పుడే రెడ్డిలు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు.నాటి కాలంలోనే చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న వెంకటరామి రెడ్డి ఎంతోమంది నిరుపేద రెడ్డి కులస్తులకు చదువు చెప్పిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు.
రెడ్డి జాతి గర్వపడే విధంగా ప్రతి రెడ్డి చదివే ప్రామాణికంగా ముందుకు సాగాలన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెడ్డిలలో ఐక్యత కు కొదవలేదని మనం తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఆ నమ్మకం నాకు కలిగిందన్నారు.
రెడ్డి జాతి అన్ని రంగాల్లో ముందడుగు వేయాలంటే రెడ్డి కార్పొరేషన్ ఏకైక మార్గమని అది సాధించుకునే దిశగా ప్రతి రెడ్డి ముందడుగు వేయాలని అంజిరెడ్డి పిలుపునిచ్చారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి చేద్దామని అన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రెడ్డి మాట్లాడుతూ.మన ఐక్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో 5 ఎకరాల స్థలాన్ని అక్కడ నిర్మించే భవనానికి నిధులు కేటాయించడం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని అవసరాల్ని తీర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు.
ఒక పిలుపుతో ఎంతమంది తరలిరావడం మన ఐక్యతకు నిదర్శనం అని రానున్న రోజుల్లో నిరుపేద రెడ్డిల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరం పాటుపడదామని అరుణ రెడ్డి పిలుపునిచ్చారు.సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి కి జాతీయస్థాయి అవార్డు రావడానికి హర్షిస్తూ పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా నేవురీ వెంకట్ రెడ్డిని రెడ్డి బాంధవులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం పదవ తరగతి ఫలితాలలో 10 జిపిఎస్ సాధించిన తొమ్మిది మంది రెడ్డి విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరి రామ్ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు కూర్మాని లింగారెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, నీవూరి వెంకట్ రెడ్డి,కనమేని చక్రధర్ రెడ్డి, పాతూరి మహేందర్ రెడ్డి, పొన్నాల బాల్రెడ్డి ,ఎద్మల తిరుపతి రెడ్డి మరియు పాశం రాజేందర్ రెడ్డి, బాణాపురం రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, సతీష్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, జలజ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి ,నాగిరెడ్డి ,మహేశ్వర్ రెడ్డి అలాగే జిల్లా రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు నేవురి మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.