ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది పురుషులను కలవర పెడుతున్న సమస్యల్లో బట్టతల ( Bald )ఒకటి.ఇటీవల ఎంతో మంది చిన్నవయసులోనే బట్టతల బారిన పడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల జుట్టు ఊడిఊడి చివరకు బట్టతలకు దారితీస్తుంది.దీంతో పురుషులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.
అందులోనూ పెళ్లి కాని అబ్బాయిలైతే మరింత మదన పడుతుంటారు.అయితే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే బట్టతలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, ( Onion slices )నాలుగు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, రెండు లేదా మూడు మందార ఆకులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె, అర గ్లాసు ఆవ నూనె వేసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.నాలుగు లవంగాలు, ( Cloves )అంగుళం దాల్చిన చెక్క, నాలుగు దంచిన మిరియాలు కూడా వేసి 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
</br.
ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మర్దన చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
కురులు ఒత్తుగా పెరుగుతాయి.బట్టతల వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.
అలాగే తెల్ల జుట్టు త్వరగా రాకుండా సైతం ఉంటుంది.