రిటైర్మెంట్ తర్వాత ఖరీదైన లంబోర్ఘిని కొన్నాడు.. అందులోంచి దిగలేక ఏం చేశాడంటే

ప్రతి మనిషి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి.రోజువారీ ఇబ్బందులు, పిల్లల చదువులు, ఆపై వారికి ఇల్లు కట్టడం వారి పెళ్లి చేయడం ఇలాగే జీవితం గడిచిపోతుంది.

 After Retirement, He Bought An Expensive Lamborghini What Did He Do When He Coul-TeluguStop.com

చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోలేరు.చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే తమ జీవితం గడిపేస్తారు.

ముఖ్యంగా తమ జేబులో ఏవైనా కొంత డబ్బులు ఉంటే వాటితో తమ పిల్లలకు( children ) ఏవైనా కొనుక్కెళ్లాలనే తపన ఉంటుంది.ఇలాగే తమ జీవితం గడుపుతూ తమకుండే కోరికలను పక్కన పెట్టేస్తారు.

అయితే ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత తమ కలను నెరవేర్చుకుంటే వారి ముఖంలో కనిపించే సంతోషం మామూలుగా ఉండదు.వెయ్యి వోల్టుల బల్బులా వారి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది.

అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఇది నవ్వు పుట్టించినా చివరికి ఎంతో సందేశాన్ని ఇస్తోంది.

దీనికి సంబంధఇంచిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Couldnt-Latest News - Telugu

సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది.పదవీ విరమణ తర్వాత ఓ వృద్ధుడు లంబోర్ఘిని( Lamborghini ) కారు కొనుగోలు చేశాడు.ఆ ఖరీదైన లంబోర్ఘిని కారులో అతడు రైడ్‌కి వెళ్లాడు.

అంత వరకు బాగానే ఉంది.అయితే రైడ్ పూర్తయ్యాక అందులో నుంచి ఎలా దిగాలో ఆయనకు అర్ధం కాలేదు.

వృద్ధుడు కారు( old man ) నుండి దిగడానికి కొంచెం కష్టపడ్డాడు.కానీ చివరికి అతను బయటకు దిగాలంటే చాలా కష్టపడాలని అతడికి అర్థం అయింది.

చివరికి కింద పడుకుని పాక్కుంటూ కారు నుంచి బయటకు వచ్చాడు.ఇలా అతి కష్టం మీద కారు నుంచి ఆ వృద్ధుడు దిగాడు.

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.వీడియోలో ప్రజల స్పందన కనిపిస్తోంది.

మీ కలను నెరవేర్చుకోవడానికి, చివరి వరకు మీ జీవితంతో పోరాడండి, ఒక రోజు అది నెరవేరడం ఖాయం అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.వృద్ధాప్యంలో లంబోర్ఘిని కొంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇంకొకరు కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube