జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుందని, పొత్తులతో జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు.
ఇక జనసేనతో పొత్తు పెట్టుకున్న బిజెపి కూడా పవన్ పైనే ఆశలు పెట్టుకుంది.పవన్ ద్వారానే బిజెపి గ్రాఫ్ పెరుగుతుందని బలంగా నమ్ముతోంది.
గతంతో పోలిస్తే జనసేన( Janasena ) ప్రభావం పెరిగిందనే చెప్పవచ్చు .ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.దీనికి తగ్గట్లుగానే పవన్ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల నిర్వహించిన వారాహి యాత్రకు ( Varahi Yatra )ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి స్పందన వచ్చింది.
జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు, యాత్రలు చేపట్టేందుకు , పార్టీకి పెరిగిన గ్రాఫ్ తో పవన్ లో ఉత్సాహం కనిపిస్తోంది.అయితే ఇప్పటివరకు పవన్ కు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు అంతంత మాత్రమే అన్నట్టు గా ఉండడంతో ,2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపించబోతుండడంతో, మెగా హీరోలు ఒక్కొక్కరు జనసేనకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు.

తాజాగా విడుదలై థియేటర్లో నడుస్తున్న బ్రో సినిమా( Bro movie ) యూనిట్ ఏపీలో పర్యటిస్తోంది.విజయవాడ కనకదుర్గమ్మ ను చిత్ర యూనిట్ దర్శించుకుంది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు హీరో సాయిధర్మ తేజ్ పవన్ గురించి , జనసేన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తామంతా పవన్ వెంటే నడుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.మాకు రాజకీయాలు తెలియవు కానీ, పవన్ కోసం మాత్రం మేమంతా ఉంటామంటూ సాయి ధరమ్ తేజ్ ప్రకటించడం తో జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఇప్పటికే అనే సందర్భంలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ( Mega Hero Ram Charan Tej )కూడా పవన్ కు తమంత అండగా నిలబడతామని ప్రకటించారు.అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కానీ, పరోక్షంగా పవన్ కోసం తెర వెనుక చేయాల్సింది చేస్తున్నారట.

బహిరంగంగా చిరంజీవి మద్దతు ప్రకటించకపోయినా, తమ్ముడు కోసం ఎన్నికల సమయం నాటికి రంగంలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు జనసేనకు ఒక్కొక్కరుగా మెగా హీరోల మద్దతు లభిస్తుందడంతో, ఎన్నికల సమయంలో వీరంతా ప్రచారానికి దిగితే జనసేనకు మరింతగా కలిసి వస్తుందనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.