మొన్నటి వరకు వర్షాలు దంచి కొట్టాయి.వాగులు, వంకలు, చెరువులు,కుంటలు నదులు అన్నీ పొంగిపొర్లాయి.
కొన్ని గ్రామాల్లో చెరువుల కట్టలు తెగిపోయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ వర్షాలు ఈసారి ఉమ్మడి వరంగల్ ( Warangal )జిల్లాలోనే ఎక్కువగా పడ్డట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈ వర్షాల కారణంగా వరంగల్,హనుమకొండ ప్రాంతాలతో పాటుగా ములుగు జిల్లాలో కూడా విపరీతమైన నష్టం వాటిల్లింది.

ప్రజల ఇల్లు,పంటలు నీటిపాలయ్యాయి.ఈ తరుణంలో వారు సహకారం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే వరద ప్రభావిత ప్రాంతాలను ఈరోజు గవర్నర్ తమిళసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) పరామర్శించనున్నారు.
ఆమె హైదరాబాద్ పట్టణం నుండి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నిట్ కు చేరుకుంటుంది.గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉండేటువంటి వరద ప్రభావిత కాలనీల ప్రజలను పరామర్శించనున్నారు.

భద్రకాళి( badrakali ) చెరువు కట్ట తెగడం వల్ల నష్టపోయినటువంటి భద్రకాళి బండ్ ప్రజలు,నయీమ్ నగర్, కేయూ క్రాస్ రోడ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్, జవహర్ నగర్ ఇంకా ప్రభావిత ప్రాంతాలకు గవర్నర్ వెళ్లనుంది.అంతేకాకుండా ఈ బాధితులైనటు వంటి వారికి రెడ్ క్రాస్( Red cross ) సొసైటీ ద్వారా హెల్త్ కిట్స్ ను కూడా పంపిణీ చేయనున్నట్టు సమాచారం.మధ్యాహ్న సమయం వరకు వరంగల్ పర్యటన ముగించుకొని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారు తమిళసై.ఇప్పటికే వరద ప్రాభావిత ప్రాంతాలను గుర్తించడం కోసం వచ్చినటువంటి కేంద్ర బృందం ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలలో పర్యటించనుంది.
అంతేకాకుండా పూర్తిగా మునిగిపోయి సర్వస్వం కోల్పోయినటువంటి మోరంచపల్లి, కొండాయి గ్రామాలను కేంద్ర ప్రత్యేక బృందం సందర్శించి వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది.అంతేకాకుండా రేపు తెలంగాణలో పలు వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం( Centrol team) పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.







