రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం సారంపల్లి,ఒబులాపూర్ గ్రామాలలో చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకొని పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంపిడిఓ, ఎస్సై , ఇరిగేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు కట్టలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీపీ పడిగల మానస.భారీ వర్షాల( Heavy Rains ) నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్న ప్రజా ప్రతినిధులు వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను కల్వర్ట్లను పరిశీలించి వాటి మరమ్మతుల కోసం మంత్రి కేటీ రామారావు( Minister KTR ) దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు అయ్యేవిధంగా ప్రయత్నిస్తామని పేర్కొన్న ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, స్థానిక సర్పంచులు కొయ్యడ రమేష్, నందగిరి నర్సయ్య, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీడీవో లచ్చాలు, ఇరిగేషన్ ఏఈ రాహుల్ లి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామా గౌడ్, మైనార్టీ నాయకులు ఎండి హమీద్, నాయకులు కొత్త సంతోష్ గౌడ్, వంగ తిరుపతి రెడ్డి ,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు.