రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట గ్రామంలో నివాస యోగ్యం గా లేక మొండి గోడలకు పరిమితమైన ఇండ్లను ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Former MPTC Oggu Balaraju Yadav ) పరిశీలించారు.వార్డులలో ఇలాంటి గోడలు చేయడం వల్ల వర్షం దాటికి వీటిలో నీరు నిల్వ ఉండడం వల్ల పక్కన ఉన్న ఇండ్లకు నీటి తేమ తగిలి వారి ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయని గ్రామస్థులు బాలరాజ్ యాదవ్ తో చెప్పారు.
అదే విధంగా ఇలాంటి గోడల నుండి పాములు, తేల్లు రాత్రి పూట వస్తున్నాయని దీంతో బయపడుతున్నమని చెప్పగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వీటిని నేలమట్టం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.