హైపర్ ఆది( Hyper Aadi) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.ఇక ఈయన చేసే కామెడీలో మొత్తం డబల్ మీనింగ్ డైలాగ్స్ లో ఉంటాయి.
తోటి ఆర్టిస్టులను టార్గెట్ చేసి బాగా పంచులు వేస్తూ ఉంటాడు.అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిపై డబల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతూ ఉంటాడు.
ఆ డైలాగ్స్ ను క్లియర్ గా అర్థం చేసుకుంటే చాలా బూతులుగా ఉంటాయి.అంతేకాకుండా వారిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి బాగా రచ్చ చేస్తూ ఉంటాడు.
కేవలం షోలలోనే కాకుండా ఈవెంట్లలో కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా దీపిక పిల్లిపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేయటంతో ఆ మాటలు విని జనాలు హైపర్ ఆది పై ఫైర్ అవుతున్నారు.
ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.

రీసెంట్ గా ఢీ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఆ ప్రోమో మొత్తం బాగా సరదాగా సాగినట్లు కనిపించింది.కానీ మధ్య మధ్యలో హైపర్ ఆది చేసిన రచ్చ మాత్రం అందరికీ చిరాకు తెప్పించింది.
ఇందులో సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి( Deepika Pilli) అదిరిపోయే డాన్స్ తో చూపులు తిప్పుకోకుండా చేసింది.ఇక హైపర్ ఆది లుంగికట్టుకుని వచ్చి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు.

అంతేకాకుండా గుడుంబా శంకర్ సినిమా( Gudumba Shankar )లోని కిళ్లి కిళ్లి అనే పాటకు డాన్స్ చేశారు.ఇక అందులో హైపర్ ఆది వన్స్ మనం ఫిక్స్ అయ్యాక అది పిల్లి అయినా కిల్లి అయిన నమిలేయడమే అని దీపిక పిల్లిని ఉద్దేశించి కామెంట్ చేశాడు.ఆ తర్వాత స్కిట్లో హైపర్ ఆది అరటిపండు తొక్కను దీపిక పిల్లికి గిఫ్ట్ గా ఇవ్వటంతో.వెంటనే యాంకర్ ప్రదీప్( Pradeep).ప్రపంచంలో ఎవడైనా అరటిపండు తొక్క గిఫ్ట్ గా ఇస్తాడా అంటూ ప్రశ్నించాడు.దాంతో చమ్మక్ చంద్ర ఏంటి మా అమ్మాయికి టెంట్ వేస్తున్నావా.
అని అనటంతో వెంటనే హైపర్ ఆది.ఆల్రెడీ టైం వేసేసా ఇక స్టంట్ వేయడమే.అంటూ కాస్త డబల్ మీనింగ్ డైలాగ్ వేశాడు.ఇక ఆ డైలాగులకు దీపిక పిల్లి షాక్ ఛీ ఛీ అని సరదాగా చీదరించుకుంది.దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా హైపర్ ఆది పై మండిపడుతున్నారు.

కాస్త అదుపులో ఉండి డైలాగ్స్ కొట్టమని.అవతలి వ్యక్తి ఎవరున్నారో వాళ్లను గౌరవించడం నేర్చుకో అని అన్నారు.డాన్స్ షోలో ఇటువంటివి యాడ్ చేసినందుకు జనాలు మరింత ఫైర్ అవుతున్నారు.
మరికొంతమంది దీపికని ఇలాగే టార్గెట్ చేసి డైలాగ్స్ కొడితే తను కూడా వెళ్లిపోవడం గ్యారంటీ అని అంటున్నారు.చూడాలి మరి చివరి వరకు ఈ షో లో ఏం జరుగుతుందో అనేది.