దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ ఆకస్మిక మరణం.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది .
సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు.ఇదే సమయంలో గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ -రాకేష్ మాస్టర్( Shekhar Master – Rakesh Master ) మధ్య ఏమి జరిగింది అనేదానిపై చర్చలు సాగుతున్నాయి .రాకేష్ మాస్టర్ వరుస సినిమాలతో దూకుడు మీది ఉన్నప్పుడు .తిండికి ఇబ్బంది పడే స్థాయిలో ఉన్న శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గరకు వెల్లడు .ఇక శేఖర్ టాలెంట్ చూసిన రాకేష్ మాస్టర్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడు.

అవకాశాలు వచ్చేలా చేశాడు.కష్టనష్టాల్లో తోడున్నాడు .అయితే శేఖర్ స్టార్ గా ఎదిగాక రాకేష్ మాస్టర్ ని నిర్లక్ష్యం చేశాడనేది రాకేష్ మాస్టర్ వాదన .ఇలాంటి పలు కారణాల వలన ఇద్దరికీ దూరం పెరిగింది.రాకేష్ మాస్టర్- శేఖర్ మాస్టర్ మధ్య గొడవలకు కారణం చిరంజీవి( Chiranjeevi ) నటించిన ఖైదీ 150 మూవీ సమయంలో అని చెబుతారు .ఆ మూవీలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.ఆ విషయం శేఖర్ మాస్టర్ .రాకేష్ మాస్టర్ కి చెప్పకుండా దాచాడు .నువ్వు, నేను వేరొకరితో అబద్ధాలు చెప్పిన పర్లేదు.మనం మాత్రం ఒకరి గురించి ఒకరు అబద్దాలు చెప్పుకో కూడదు.
ట్రాన్స్పరెంట్ గా ఉండాలని రాకేష్ మాస్టర్ శేఖర్ కి చెప్పారు .అయితే చిరంజీవి వంటి హీరో సినిమా ఛాన్స్ వచ్చిన చెప్పకపోవడంతో రాకేష్ మాస్టర్ కాస్త కలత చెందాడు .తనకు వచ్చిన ఆఫర్స్ కూడా శేఖర్ కరెక్ట్ అని రిఫర్ చేశానని … వాడు బాగుండాలనే నేను కోరుకుంటానని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు…

అయితే వాడిని నేను ఎప్పటికీ కలవను అని గతంలో చెప్పాడు .నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దని చెబుతున్నానని రాకేష్ మాస్టర్ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు .ఇక ‘తన మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు.కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది.
కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు.
గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా.
అక్కడి నుంచి వెళ్లిపోదామా అని’ ఉంటారని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.
దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్ చేస్తాడని తెలిపాడు.ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్ అవుతారని గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి .