యాదాద్రి భువనగిరి జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్న సంబరాల వలన రాష్ట్రంలోని రైతులకు ఒరిగేదేమీ లేదని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ( Erukala Venkatesh Goud )అన్నారు.బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందేందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలు చేయడం ఏంటని నిలదీశారు.
రాష్ట్రంలోని రైతాంగం ( Farmers )పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకుండా రైతు సంబరాలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరమన్నారు.
రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్,మండల కాంగ్రెస్ నాయకులు,గడ్డ మీది యాదగిరి,మడిగే వెంకటస్వామి,కోట సురేష్, బండారి శ్రీనివాస్,భూక్యా రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.