మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
ఈ మేరకు కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలు సీబీఐ కోర్టు ఎదుట హాజరైయ్యారు.మరో ఐదుగురు నిందితులు న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు.
మరోవైపు కడప జైలులో ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలను అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితుల స్టేట్ మెంట్ ను సీబీఐ కోర్టు రికార్డు చేయనుంది.