ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజీన్ గూగుల్ తాజాగా మాప్స్‌లో మరోమారు అదిరిపోయే కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ నావిగేషన్ యాప్‌ను వినియోగిస్తున్న వారిని మరింత ఆకట్టుకునేలా ఈ కొత్త అప్‌డేట్స్‌ను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా వీటిని గురించి ప్రకటించడం విశేషం అని చెప్పుకోవాలి.ఇమ్మర్సివ్ వ్యూ అనే ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతానికి యూరప్‌లోని కొన్ని కీలక నగరాల్లో మాత్రమే పనిచేస్తుంది.
అయితే త్వరలో మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇక ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు మరింత స్పష్టంగా, సురక్షితంగా, వేగంగా, ఎవరి సలహాలు సూచనలు అవసరం లేకుండా మీమీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.గూగుల్ మ్యాప్స్‌లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఇది పని చేసినప్పటికీ దానికంటే కాస్త అప్డేటెడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు.వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలను ఈ అప్‌డేట్ ద్వారా వినియోగదారులు చాలా తేలికగా తెలుసుకోవచ్చు.
రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఈ కార్యక్రమంలో గూగుల్ యాజమాన్యం ప్రకటించడం విశేషం.
ఈ ఫీచర్‌లోని ఎడ్వాన్స్‌డ్ AI టెక్నాలజీ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్‌ని వీక్షించే వెసులుబాటు కూడా కలదు.అలాగే మీకు కావలసిన ATMలు, పార్కులు, రెస్ట్‌రూమ్‌లు, రెస్టారెంట్‌లు, లాంజ్‌లు, టాక్సీస్టాండ్‌లు, ట్రాన్సిట్ స్టేషన్‌లు, రెంటల్ కార్స్ వంటి అనేక విషయాలను గుర్తించడంలో మీకు ఇది సహాయపడుతుంది.AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్ విత్ లైవ్ వ్యూ” గురించి కూడా ఈ బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
అలాగే బార్సిలోనా, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, బెర్లిన్, మాడ్రిడ్, పారిస్, మెల్‌బోర్న్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్‌లు , మాల్స్ లాంటి వివరాలు రానున్న కాలంలో అందిస్తున్నట్లు ఈ బ్లాగ్‌లో రాసుకొచ్చింది.