నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రెస్‌మీట్ ఫోన్ ట్యాపింగ్ కాదు… మ్యాన్ ట్యాపింగ్.ట్యాపింగ్ పై ఆధారాలుంటే నిరూపించు.
జగన్ గారు పక్కన ఉంటేనే మనకు బలం బాబు ఉచ్చులో పడి కోటంరెడ్డి లేనిపోని ఆరోపణలు మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డిమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే
అది మ్యాన్ ట్యాపింగ్ .పార్టీ మారాలనుకున్నప్పుడు… ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లేనిపోని ఆరోపణలు కోటంరెడ్డి మాపై చేస్తున్నాడు.అది ఒక వ్యక్తి తన ఫోన్ తో చేసుకున్న ఆడియో రికార్డింగ్ అని శ్రీధర్‌రెడ్డికి కూడా తెలుసు…అయినా తనను అనుమానించారు, అవమానించారు…అంటున్నాడు.
కోర్టులో కేసు వేస్తానన్నాడు.కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానన్నాడు.మరి మూడు రోజులుగా నువ్వు ఎందుకు ఆ పనిచేయడం లేదు…ఎందుకంటే శ్రీధర్‌రెడ్డి అంతరాత్మకు తెలుసు… అది ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్ అని.అది కూడా చంద్రబాబు శ్రీధర్‌రెడ్డిని మ్యాన్‌ట్యాపింగ్ చేశారు తప్ప ఫోన్ ట్యాపింగ్ కానేకాదు.బాబు చెప్పే మాటలే శ్రీధర్‌రెడ్డి చెబుతున్నాడు.దీనికి తాన తందాన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ అని వంత పాడుతున్నారు.బాబు ఎలాంటి వాడో జగద్వితం.బాబు ఎలాంటి నీచ రాజకీయాలు చేస్తాడో శ్రీధర్‌రెడ్డి, మేము అనేక సార్లు మాట్లాడుకున్నాం.
బాబు నిజాలను ఎలా తిమ్మిని బమ్మిని చేస్తాడో, ఎంతగా వక్రీకరిస్తాడో అందరికీ తెలిసిన విషయమే.అన్నీ తెలిసి కూడా, మరి నీ బుద్ధి ఏమయింది కోటంరెడ్డీ.?
టీడీపీ గూటికి వెళ్ళాలన్న పక్కా ప్లాన్ తోనే.కోటంరెడ్డి గురించి ప్రెస్‌మీట్ పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలేదు.
శ్రీధర్‌రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం.పార్టీ మారాలనుకున్నప్పుడు వైఎస్సార్‌సీపీపై బురద చల్లి, టీడీపీకి లబ్ధి చేయాలనుకోవడం సరికాదు.2014 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత గట్టి పోటీ ఉందో శ్రీధర్‌రెడ్డి మనస్సాక్షికి తెలుసు.అప్పుడు నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను.అయితే నేను అనేక సందర్భాల్లో శ్రీధర్‌రెడ్డికి చెప్పిందేంటంటే…”నువ్వు నాకు సమీప బంధువువి.ఆ రోజు జగన్ గారి స్థానంలో ఎవరున్నా సరే…నీకు టిక్కెట్ రానేరాదని చెప్పాను.అనేక సందర్భాల్లో ఈవిషయం చెప్పాను.” వాస్తవాలు చెప్పినందుకు.తర్వాత కూడా శ్రీధర్‌రెడ్డి మాపై విమర్శలు చేయవచ్చు.
శ్రీధర్‌రెడ్డే చెప్పాడు.నా గురించి జగన్ గారు ఒక్కరే ఆలోచన చేసి , తనను ఎంతగానో ప్రోత్సహించారన్నాడు.
అనేక సంవత్సరాలుగా నీకు అవకాశాలు లేని సమయంలో జగన్ గారు నీకు ఎంతో గొప్ప అవకాశాన్నిచ్చారు.ఈ రోజు నీకు పదవులు రాలేదనో, మరో కారణమో ఉండవచ్చు.
దాని గురించి మాట్లాడవచ్చు.మొన్నటికి మొన్న శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెబుతున్నారని , మీ స్పందనేంటి? …అని మీడియా వాళ్లు నన్నడిగితే …ఆధారాలు చూపించమన్నాను.వెంటనే నీకు బాబు నుంచో, టీడీపీ నుంచో మార్గదర్శకత్వం వచ్చిందేమో తెలియదుకాని కానీ, వెంటనే ఆడియో ఒకటి మార్కెట్‌లో హల్‌చల్ చేసింది…ఆ ఆడియోలో నువ్వేమన్నావు? 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తున్నానని ప్రకటించావు.నీకు అవమానం జరిగింది, దాని గురించి చర్చ జరగాలని నువ్వు మాట్లాడకుండా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించావంటే ముందస్తుగానే నువ్వు ఆ పార్టీలోకి వెళ్లాలనుకున్నది వాస్తవం కాదా? పైగా ఇప్పుడేమంటున్నావు? వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిపోవాలనుకుని నెల కిందట వరకు అనుకోలేదని , ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నానని అంటున్నావు.
జగన్‌గారి పక్కనుంటేనే మనకు బలంఃమనం బలమైన వ్యక్తులం కాదు.జగన్‌గారి పక్కనుంటేనే మనకు బలం అన్నది గుర్తెరగాలి.జగన్ గారు ఒకటి అనుకుంటే మనందరం సున్నాలుగా కలిస్తేనే బలపడతాం.జగన్ గారు అనే ఒకటి కలవకపోతే మనం సున్నాలుగానే మిగిలిపోతామని గుర్తిస్తే మంచిది శ్రీధర్‌రెడ్డీ.
జగన్ గారిని చూసే మనల్ని గెలిపించారు.ఈ రోజు నేను మంత్రినైనా, నువ్వు ఎమ్మెల్యేవైనా మనందరికీ రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతో మొదలై జగన్ గారితో బలపడింది.
ఆ రోజు వైఎస్సార్ సీపీని, జగన్ గారిని చూసి మనకు ఓటేశారు.అంతమంది ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో గెలిచామంటే అదంతా జగన్ గారిని చూసే… ఆయన పుణ్యమే.
ఆయన పెట్టిన భిక్ష కాదా…రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచామంటే అది జగన్ గారిని చూసే మనల్ని జనం గెలిపించారు.జగన్ గారి పోరాటపటిమే వైఎస్సార్‌సీపీ విజయసాధనం.
టీడీపీకి ఒక అస్త్రం అందించడానికి నువ్వు చేసే పని సరికాదు.జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లినా భయపడకుండా పోరాట పటిమతో పార్టీని నడిపించి, 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు.
ఈ రోజు ఒకరో, ఇద్దరో వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి, జగన్‌గారికి నష్టమేమీ లేదు.అంతకన్నా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తారు.
అందుకే ఆదాల ప్రభాకరరెడ్డి గారిని తీసుకొచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.సమర్థంగా అందరం పనిచేస్తాం.
నెల్లూరు రూరల్ లో నీ బలం, నా బలం కాదు.జగన్ గారి బలమే ఉంటుంది.
ఒక సామెత ఉంది.నా కోడి కూస్తేనే తెల్లవారుతుందని, తన కోడిని గొంతు నొక్కి కూర్చున్నాడట.
తెల్లవారింది .గొంతు నొక్కి న కోడి గాలి ఆడక చచ్చింది.రాజకీయాల్లో హత్యలు ఉండవు.ఆత్మహత్యలు ఉంటాయి.టీడీపీలోకి వెళ్లాలన్న నీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం.
వేరేవారి విధేయుడివి ఎలా అయ్యావ్ః నీ మనస్సాక్షి ఒక్క ఆలోచన చేస్తే.
ఈ రోజు నీవున్న ఉన్నత స్థితికి కారకులు జగన్ గారు కాదా…అని అడుగుతున్నాను.నువ్వు నిన్నటిదాకా జగన్ గారికి వీర విధేయుడినన్నావు.మరి అలాంటి వ్యక్తివి ఈ రోజు వేరే వారికి విధేయుడివయ్యావు.కానీ కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయడం సరికాదు.
నీ హయాంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగినా…జగన్ గారు వేరే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా నీకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంపూర్ణ బాధ్యతలు అప్పగించారు.జగన్ గారు అలా నిన్ను నమ్మకపోతే నీ పరిస్థితి ఏంటి? ఏ అధికారి అయినా పనిచేసేలా, నువ్వు చెప్పిన ప్రతి పనిని జగన్ గారు శరవేగంగా చేయించకపోతే నువ్వు నియోజకవర్గంలో అధికారాన్ని చెలాయించగలిగేవాడివేనా? పదవులు రాలేదు కనుక వెళ్లిపోతానంటే బాధ లేదు.కాని లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు.
నీ అక్రమాలపైన విచారణకు సిద్ధమేనా?నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బార్లు, ఇసుక వంటి వాటన్నిటిపై విచారణ చేయిద్దాం.సిద్ధమేనా? నువ్వు ఏరోజూ జెడ్పీ సమావేశాలకు రాని వాడివి జిల్లా సమీక్షకు మాత్రం వచ్చి, మాట్లాడావు.అప్పటికే టీడీపీలోకి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నావు కనుక వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు.
లేనిపోనివి ఊహించుకుని, బాబు ఉచ్చులో పడి జగన్ గారిపై బురద జల్లడం మంచిది కాదు.నీకు కొందరు వ్యక్తుల గురించి ఇష్టాఇష్టాలు ఉండవచ్చు.సజ్జల గారి గురించి విమర్శలు చేసున్నావు.పార్టీలో లోపాలు, తప్పులు జరిగితే ఆయన అడుగుతారు.
అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తున్నావు.ఏదో ఆడియో ఒకటి విడుదలైతే ఆయనకు ఆపాదించి, విమర్శలు చేస్తున్నావు.
అది మంచిది కాదు.నువ్వు ఆలోచించు, ఆవేశపడకు…నూటికి 90 శాతం మంది నీ వద్దకు వచ్చి నువ్వు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నావని అనవచ్చు.
అదే వ్యక్తులు బయటకు వచ్చి ఇంత తప్పుడు నిర్ణయం శ్రీధర్‌రెడ్డి ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు.మాకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డితో సంబంధం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే మాకు ముఖ్యం అంటున్నారు.పార్టీకి ఎవరు విధేయులుగా ఉంటారో వారినే పార్టీ గుర్తు పెట్టుకుంటుంది.
శ్రీధర్‌రెడ్డి అంటున్నాడు.మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేయండి.
అరెస్టు చేయండని అడుగుతున్నారు….అవేవీ చేయాల్సిన పని లేదు.
ఈ రోజు ఆదాల ప్రభాకరరెడ్డి గారు సమన్వయకర్తగా ఉన్నారు.ప్రభాకరరెడ్డి గారికి సంపూర్ణంగా సహకరిస్తాం.
బాబు ఉచ్చులో కోటంరెడ్డిఃశ్రీధర్‌రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి, కాల్చాలని బాబు నిర్ణయించాడు కాబట్టే శ్రీధర్‌రెడ్డి ఆ ఉచ్చులో పడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు.అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.
ఏది ఏమైనా …2024 ఎన్నికల్లో నెల్లూరు పాత జిల్లాలో 10కి 10 స్థానాలు, అలాగే కొత్త జిల్లాలో 9కి 9 స్థానాలనూ గెలుస్తాం.పార్లమెంటు స్థానాన్నీ కైవసం చేసుకుంటాం.
శ్రీధర్‌రెడ్డిని కోరుకునేది…ఒక్కటే…ఫోన్‌ట్యాపింగ్‌పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తావో, కోర్టుకు వెళ్తావో అది నీ ఇష్టం.ఆ పనిచేయి.
నువ్వు కొందరు వ్యక్తులతో టీడీపీలోకి వెళ్తానని మాట్లాడితే దాన్ని వారు రికార్డు చేసి, సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారే తప్ప ఎక్కడా వైఎస్సార్‌సీపీ నీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని స్పష్టం చేస్తున్నాను.ఇప్పటికైనా నువ్వు దాన్ని గ్రహిస్తే చాలు.
టీడీపీ లోకి వెళ్లాలంటే నీకు ఒక్క కారణం చాలు.కాని వైఎస్సార్‌సీపీలో ఉండాలంటే వంద కారణాలు ఆలోచన చేయాలి.
శ్రీధర్‌రెడ్డిపై జగన్ గారికి వల్లమాలిన ప్రేమ ఉంది.నీకు అవమానం జరగలేదు.
పార్టీలో పదవులు ఇవ్వలేదు కనుక వెళ్తానంటే వెళ్ళు…అంతే కాని ట్యాపింగ్ అనే మాటలు వద్దు.చేతనైతే రుజువు చేయి.
బాబుకు ఉన్న నేర మనస్తత్వాన్ని నీకు అంటగడుతున్నాడు.కనుక నువ్వూ ఆ బాటలో నడుస్తున్నావు.
కన్నతల్లి వంటి పార్టీపై అభాండాలు వేయడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నా.
యువగళం మూగబోయిందిఃఈ రోజు తన కొడుకు లోకేశ్ యువగళం జనం లేక వెలవెల బోయి, మూగబోయిందని చంద్రబాబు తల్లడిల్లుతున్నాడు.
యువగళం విఫలమయింది కనుక బాబు నీతో మాట్లాడిస్తున్నాడు.జనం రాకపోతే, కూలికి పనిచేస్తున్న జనం 400 మందితో యువగళం నడుస్తోంది.జగన్ గారి ప్రసంగాలను కాపీ కొట్టాలని చూస్తే అది బెడిసికొడుతుంది.అమ్మా…అక్కా…చెల్లీ…అంటూ లోకేశ్ ఒక బిచ్చగాడిలా సాగదీసి మాట్లాడితే జనం అభిమానిస్తారా ? లోకేష్ పాదయాత్ర విఫలమయింది కనుకే బాబు- శ్రీధర్‌రెడ్డి వంటి వారితో రకరకాల ప్రెస్‌మీట్లు పెట్టించి, రకరకాల వేషాలు వేయిస్తున్నాడు.