వావ్! ఇక్కడ 10 రూపాయలకే బిర్యానీ.. రుచి మాత్రం అదుర్స్..!

ఈ రోజుల్లో నూనెలు, పప్పులు, బియ్యం, ఇంకా ఇతర ఆహార పదార్థాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో చిన్న టీ షాప్ నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని ఫుడ్ ఐటమ్స్ రేట్లు డబుల్ అయ్యాయి.

 Man Offering Tasty Veg Biryani For Just 10 Rupees Details, Biryani, Hyderabad Bi-TeluguStop.com

ప్రస్తుతం చిన్నపాటి టిఫిన్‌ సెంటర్లలో ప్లేట్‌ ఇడ్లీ, బోండ లేదా దోశ కొనాలన్నా కనీసం 30 రూపాయలు వేచించాల్సి వస్తోంది.మరికొన్ని చోట్ల ఈ రేట్లు రూ.100 వరకు పలుకుతున్నాయి.ఇక భోజనం చేయాలంటే రూ.150 వరకు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది.

ఇలాంటి హై రేట్స్ ఉన్న నేపథ్యంలో ఒక బిర్యానీ సెంటర్ యజమాని కేవలం 10 రూపాయలకే రుచికరమైన వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు.

వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించినా.నమ్మక తప్పదు ఎందుకంటే కళ్ళముందే అతను పది రూపాయలకు కడుపునిండా వేడివేడి బిర్యానీ అందిస్తున్నాడు.ఇంతకీ ఎవరతను.ఈ బిర్యానీ సెంటర్ ఎక్కడ అనేది తెలుసుకుంటే.

మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్‌ గాజులరామారం డివిజన్‌ దేవేందర్‌నగర్‌లో ఒక బిర్యానీ సెంటర్ పెట్టాడు.గతంలో ఈ వంటగాడు అంబర్‌పేట్‌లో బిర్యానీ సెంటర్ నడిపేవాడు.

Telugu Biryani, Veg Biryani, Cheap Biryani, Devender Nagar, Mahesh-Latest News -

ఇప్పుడు దేవేందర్‌నగర్‌కి తన సెంటర్‌ను షిఫ్ట్ చేసి అక్కడి ప్రజలకు రూ.10కే వెజ్‌ బిర్యానీతో దేవుడిగా మారాడు.పది రూపాయలకి ఈ రోజుల్లో తినేవి ఏమైనా వస్తున్నాయా అని అడిగితే టక్కున సమాధానం చెప్పడం కష్టం.ఇలాంటి రోజుల్లో అతను పెద్దగా లాభాలను చూసుకోకుండా పది రూపాయలకే టేస్టీ బిర్యానీ ప్రజలకు అందిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.

డైలీ 70 నుంచి 100 ప్లేట్ల వరకు బిర్యానీ సేల్ చేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మహేష్ ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే వచ్చే సంతృప్తి వేరని అంటున్నాడు.

Telugu Biryani, Veg Biryani, Cheap Biryani, Devender Nagar, Mahesh-Latest News -

అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్‌ బిర్యానీ బోర్డు చూసి ఇక్కడ క్యూ కడుతున్నారు.అలా ఎప్పుడూ తన బిర్యానీ సెంటర్‌లో రష్ ఉంటుందని ఇతని చెబుతున్నాడు.

ఇకపోతే మహేష్ అంబర్‌పేట్‌లో తన బిర్యానీ సెంటర్‌ను మూసి వేయలేదు.అందుకు బదులుగా దానిని తన కుటుంబ సభ్యులకు అప్పగించాడు.

అలా అక్కడ కూడా ప్రజలకు తక్కువ రేట్లకే మంచి బిర్యానీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube