మన చిన్నప్పుడు ఒక మాట బాగా వినబడేది.బాగా చదువుకోకపోతే, బర్రెలు కాయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావురా? అనేవాళ్లు.కానీ నేడు అదే బర్రెలు కాసుకోవడం వలన లక్షల్లో ఆదాయం వస్తుంది అంటే మీరు నమ్ముతారా? మీరు నేడు చూసే వుంటారు.పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు కూడా లక్షల్లో తీసుకొనే జీతాలను వదిలేసి, గాడిదలు, బర్రెలను కొనుక్కొని వ్యాపారం చేసుకుంటున్నారు.
ఈరోజుల్లో పాడిపరిశ్రమకు ఎంత గిరాకీ ఉందో మీకు బాగా తెలుసు.మంచి ప్లేస్ ఉండి, ఇద్దరు ముగ్గురు పని వాళ్లను పెట్టుకుంటే, గేదలు, ఆవులు కొనుగోలు చేసి పాలు మార్కెట్‌లో విక్రయించవచ్చు.
అయితే మన దగ్గర ఉండే సాధారణమైన ఆవులు, గేదలు కాకుండా.ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోయే ఆవులు కొనుగోలు చేస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే అని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ముందుగా గిర్ ఆవులు గురించి తెలుసుకోవాలి.వీటి పెంపకం ద్వారా రైతులు ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.
మన దేశంలో అత్యధిక పాలిచ్చే ఆవు జాతిగా గిర్ ఆవులకు మంచి డిమాండ్ వుంది.గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ ఆవులను ప్రస్తుతం దేశమంతటా ఉన్నాయి.
ఇవి సగటున రోజుకు 12 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.
ఇక లాల్ సింధీ ఆవు గురించి విన్నారా? ఈ ఆవు సింధ్ ప్రాంతానికి చెందినది.పంజాబ్, హర్యానా, కర్నాటక, తమిళనాడు , కేరళ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు ఎక్కువగా ఈ ఆవులను పెంచుతున్నారు.సగటున 12 నుంచి 20 లీటర్ల వరకు పాలను ఇస్తాయి.
అలాగే సాహివాల్ ఆవు గురించి తెలుసా? హర్యానా, ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్‌లో వీటిని ఎక్కువగా పెంచుతున్నారు.ఇవి సగటున ప్రతి రోజు 10-20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.
చాలా మంది రైతులు, డైరీ నిర్వాహులకు ఎంతో ఇష్టమైన ఆవు ఇది.కాబట్టి వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి.