ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులకు చెక్

జెనజేషన్స్ త్వరగా మారిపోతున్నాయి.అందరు టెక్నాలజీలకు అలవాటు పడిపోతున్నారు.

బైకులు, స్కూటీలు వచ్చాక మనుషులు నడవడం( Walking ) తగ్గించేశారు అనేది నిజం.

చిన్న పనైనా బండి బయటికి తీయాల్సిందే అంటున్నారు.

ఒకప్పుడు ఎంత దూరం అయినా కొన్ని పనులుకు నడిచి వెళ్లేవారు.కానీ ఇప్పుడు పక్క సందుకు వెళ్లాలంటే కూడా బైక్ తప్పనిసరి అయిపోయింది.

అయితే ప్రతిరోజు నడిస్తే చాలా వ్యాధులకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతుంటారు.రోజు 30 నిముషాలు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయట.

Advertisement

ఈ ప్రయోజనాలు వింటే మీరు కూడా వెంటనే నడవడం మొదలు పెడతారు.కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది.

ఈరోజు చాలా మందికి ఉండే సమస్య కొలెస్ట్రాల్.అయితే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా కూర్చుంటే వస్తుందని చెబుతుంటారు.

అయితే ఈ సమస్యను ఎలా తగ్గించాలని ప్రయత్నిస్తుంటారు.ప్రతిరోజు దాదాపు 30 నిముషాలు నడవడం వాళ్ళ కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం సాధారణ శారీరక శ్రమ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.అంతే కాదు వ్యాయామం కూడా ఇందుకు సహాయం చేస్తుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Advertisement

BP నియంత్రణ:

ఈరోజుల్లో BP అనేది కూడా కామన్ అయిపోయింది.మరి BP తగ్గడానికి కూడా నడవడం సహాయం చేస్తుందని చాలా మందికి తెలియదు.అవును.

చురుకైన నడక వల్ల BP తగ్గుతుంది.నడవడం ద్వారా రక్తనాళాల దృఢత్వం తొలగిపోయి రక్త ప్రసరణ సులభంగా మెరుగుపడుతుంది.

నడవడం వల్ల BP తగ్గడమే కాదు శరీరంలో రక్తప్రసరణ సులువుగా జరుగుతుంది.

బరువు తగ్గడం:

ఎక్కువ మంది బరువు తగ్గడానికి( Weight Loss ) చాలా ప్రయత్నిస్తున్టరు.అయితే బరువు తగ్గాలంటే ముందు చేయాల్సిన పని నడవడం.కేలరీలను బర్న్ చేయడంలో నడక మీకు కచ్చితంగా సహాయపడుతుంది.

కేలరీలను బర్న్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.మీరు క్యాలరీ కాలిక్యులేటర్ ద్వారా మీ అసలు కేలరీల బర్న్‌ని నిర్ణయించవచ్చు.

మధుమేహం నుండి ఉపశమనం:

ఈరోజుల్లో తిన్న తరువాత వెంటనే కూర్చుంటున్నారు.దీనివల్ల చాలా ప్రమాదం ఉంది.తిన్న వెంటనే కూర్చోకుండా కాసేపు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

తిన్న తరువాత నడిస్తే షుగర్ స్థాయి తగ్గించడానికి( Sugar Levels ) సహాయ పడుతుంది.తిన్న తరువాత కనీసం 15 నిముషాలు నడిస్తే చాలా మంచిది.

మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి :

మనం ఎక్కువగా నడిస్తే మోకాళ్లు మరియు ఇతర కీళ్ల నొప్పులు( Knee Pains ) తగ్గుతాయి.ఎందుకో తెలుసా.ఎక్కువగా నడవడం వల్ల కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

వారానికి 7-8 కిలోమీటర్లు నడవడం వల్ల కూడా కీళ్లనొప్పులను నివారించవచ్చు.మరేందుకు ఆలస్యం.

వెంటనే మీరు కూడా నడకని అలవాటు చేసుకొని వచ్చే వ్యాధులకు ముందు నుంచే చెక్ పెట్టేయండి.

తాజా వార్తలు