భారత్‌లో కాల్‌సెంటర్ .. కంప్యూటర్ హ్యాక్ అయ్యిందంటూ అమెరికన్‌లకు టోకరా , పంజాబ్‌లో 29 మంది అరెస్ట్

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, నాగాలాండ్, మేఘాలయాకు చెందిన 29 మంది సభ్యుల గ్యాంగ్‌ను లూథియానా పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కలిసి ఫేక్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అమెరికా పౌరులను మోసం చేస్తున్నారు.

 Call Centre Duping Us Citizens Busted In Punjab, 29 Nabbed, Us Citizens , Punja-TeluguStop.com

అరెస్ట్ అయిన వారు 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారే.వీరంతా కంప్యూటర్, లాప్‌టాప్ హ్యాక్ అయ్యిందని అమెరికా వాసులకు మాయమాటలు చెప్పి.

సమస్యను పరిష్కరించే సాకుతో డబ్బును స్వాహా చేస్తారు.వీరిలో 11 మంది మేఘాలయకు చెందిన వారు.వీరికి నెలకు రూ.25,000 నుంచి రూ.45,000 వరకు వేతనం వచ్చేది.వీరు సగటున 20 మంది అమెరికా వాసుల్ని ఒక్కొక్కరిని 500 డాలర్ల చొప్పున మోసం చేసేవారు.

తద్వారా రోజుకు సుమారు 10,000 డాలర్ల చొప్పున సంపాదించారు.

ఈ కాల్ సెంటర్ దాద్ గ్రామంలోని ఓ అద్దె ఇంటి నుంచి నడుస్తోంది.నిందితుల నుంచి 14 ట్యాబ్లెట్లు, 34 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.1.17 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు( Gujarat ) చెందిన కాల్ సెంటర్ మేనేజర్ కృష్ణ .యూపీకి చెందిన ఐటీ నిపుణుడు సచిన్‌లను పక్కా సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ ( Mandeep Singh Sidhu )తెలిపారు.గత రాత్రి దాద్ గ్రామంలోని ఒక ఇంటిపై దాడి చేశామని .అక్కడ 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Telugu Nabbed, Citizens Punjab, Gujarat, Ludhiana, Manager Krishna, Mandeepsingh

పథకం ప్రకారం అమెరికాలోని వారి సహచర గ్యాంగ్ సభ్యులు .అక్కడి ప్రజల కంప్యూటర్‌లలోకి పాప్ అప్ సందేశాలను పంపుతారు.ఆ తర్వాత మీ డివైస్ హ్యాక్ అయ్యిందని చెబుతూ ఓ రిమైండర్ హచ్చరిస్తూ వుంటుంది.

కంగారుపడిన వినియోగదారులు ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్, ఆపిల్ హెడ్‌క్వార్టర్స్‌లకు చెందిన టెక్ సపోర్టింగ్ టీమ్‌లకు చెందినట్లుగా ఒక నెంబర్‌ కనిపిస్తుంది.

Telugu Nabbed, Citizens Punjab, Gujarat, Ludhiana, Manager Krishna, Mandeepsingh

యూజర్ ఆ ఫోన్ నెంబర్‌కు కాల్ చేసిన వెంటనే .నిందితులు రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని బాధితుడిని ఆదేశిస్తాడు.ఆపై దానిని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయమని అడుగుతారు.

తర్వాత కొన్ని సబ్‌స్క్రిప్షన్లు వున్నాయని.ఫెడరల్ ట్రేడ్ కమీషన్ మాత్రమే ఆ సమస్యను పరిష్కరించగలదని చెబుతారు.

ఆ కాసేపటికి నకిలీ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ ప్రతినిధిగా వున్న మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు.అతను తాను సేవ అందించాలంటే 500 డాలర్లు విత్ డ్రా చేయాల్సి వుంటుందని నమ్మబలుకుతాడు.

అలా ఈ గ్యాంగ్ మోసానికి పాల్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube