పురుషుల్లో పెరుగుతున్న ఊబకాయం.. రోజు ఈ పొడిని తీసుకుంటే బాన పొట్ట మాయం!

ఇటీవల కాలంలో ఊబకాయం( Obesity ) బారిన పడుతున్న పురుషుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.గంటలు తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయడం, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఒత్తిడి తదితర అంశాలు పురుషుల్లో ఊబకాయం సమస్యకు కారణం అవుతున్నాయి.

 Consuming This Powder Daily Will Melt The Belly Fat!, Belly Fat, Fat Melting Pow-TeluguStop.com

ఊబకాయం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందుకే ఊబకాయం నుంచి బయటపడడం చాలా అవసరం.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఈ పొడిని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును( Belly Fat ) కరిగించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Belly Fat, Powdermelt, Fat Powder, Tips, Latest, Obesity-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు మెంతులు మరియు ఒక కప్పు వాము కూడా విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న కలోంజి సీడ్స్, మెంతులు మరియు వాము మూడింటిని విడివిడిగా వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై మూడు పొడులు ఒక బౌల్ లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక టైట్ కంటైనర్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి వేసి బాగా కలిపి సేవించాలి.కలోంజి సీడ్స్, మెంతులు( Fenugreek Seeds ) మరియు వాములో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.

నిత్యం ఈ పొడిని కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమక్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

Telugu Belly Fat, Powdermelt, Fat Powder, Tips, Latest, Obesity-Telugu Health

అలాగే ఈ పొడి వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.రెగ్యులర్ డైట్ లో ఈ పొడిని చేర్చుకుంటే అధిక బరువు నుంచి బయట పడతారు.రక్తంలో చక్కెర స్థాయిలు( Blood Sugar Levels ) నియంత్రణలో ఉంటాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.అంతే కాదు ఈ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి క్యాన్సర్ వంటి వ్యాధుల అభివృద్ధికి దోహదపడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube