Mukil Menon : వారిది 80 ఏళ్ల స్నేహం.. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

ఈ ప్రపంచంలో మనకు స్నేహితులను మించిన ఆత్మీయుడు ఉండడు.బుడి బుడి అడుగులు వేసే సమయంలో చాలా మంది మనకు స్నేహితులు ఉంటారు.

 They Have 80 Years Of Friendship They Met After Many Years , 80 Yeras, Friendshi-TeluguStop.com

క్రమంగా పెరిగే కొద్దీ స్కూళ్లలో, కాలేజీలలో, ఉద్యోగాలలో మనకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు.ఎవరి ప్రాధాన్యత వారిదే.

అయితే ఏళ్లు గడుస్తున్నా చాలా మంది తమ స్నేహితులను మర్చిపోలేరు.చాలా ఏళ్ల తర్వాత స్నేహితులను కలుసుకుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేం.

ఇదే కోవలో ఓ వృద్ధురాలు తన స్నేహితురాలిని కలుసుకుంది.వారి మధ్య స్నేహం ఈ నాటిది కాదు.

ఏకంగా 80 ఏళ్ల నుంచి వారి మధ్య స్నేహం కొనసాగుతోంది.ఈ అరుదైన సన్నివేశం సోషల్ మీడియాలో ఎందరో హృదయాలను కదిలిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ముకిల్ మీనన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.80 సంవత్సరాలకు పైగా స్నేహం కలిగి ఉండి, దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఇద్దరు వృద్ధ మహిళల వీడియోను ఆయన పోస్ట్ చేశాడు.80 ఏళ్లకు పైగా ఉన్న స్నేహం.తన అమ్మమ్మ ఎప్పుడూ తన బెస్ట్ ఫ్రెండ్‌ని చూడాలని అనుకునేదని ముకిల్ తెలిపాడు.ఈ విషయం తనకు తెలియడంతో ఆమె ఫ్రెండ్ గురించి చాలా పరిశోధించాడు.ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడంతో పాటు, తెలిసిన వారిని అడిగాడు.చివరికి ఎట్టకేలకు బామ్మ ఫ్రెండ్ అడ్రస్ సంపాదించాడు.

చివరికి ఓ రోజు తన అమ్మమ్మను ఆమె వద్దకు తీసుకెళ్లాడు.అప్పటికే మంచం పట్టి ఉన్న ఆమె తన స్నేహితురాలిని చూసి వెంటనే లేచింది.

చాలా ఏళ్ల తర్వాత తన ఫ్రెండ్‌ను కలుసుకోవడంతో ఆమె సంతోషంతో పొంగిపోయింది.వారిద్దరూ ఎన్నో ఏళ్ల తమ స్నేహంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.

చివరికి వచ్చే ముందు ముకుల్ వాళ్ల అమ్మమ్మ తన స్నేహితురాలి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube