మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.చౌటుప్పల్ లో తాను అనుకున్న మెజార్టీ రాలేదన్నారు.
ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని చెప్పారు.కానీ రౌండ్ రౌండ్ కూ ఫలితాలు మారుతున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో చివరి రౌండ్ వరకూ హోరాహోరీగా పోరు కొనసాగుతుందని తెలిపారు.ఉపఎన్నికలో బీజేపీనే విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే నాలుగు రౌండ్ లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
.