అడవిలో ఎన్నో జంతువుల మధ్య ప్రతిరోజు భీకరమైన పోరాటాలు జరుగుతూనే ఉంటాయి.పులులు జింకలను వేటాడడం మనం డిస్కవరీ ఛానల్ లో చూస్తూనే ఉంటాం.
బ్రతకాలంటే కచ్చితంగా పోరాడాల్సిందే అనేలాగా అడవిలోని జంతువుల సిద్ధాంతం.ఇలా పోరాడే సందర్భాలలో రెండిటిలో ఒక జంతువు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
ప్రపంచానికి కనిపించని ఎన్నో పోరాటాలు అడవిలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి.ఇలాంటి అరుదైన దృశ్యాలను చూడడానికి అడవులలో కొన్ని కార్లను ఏర్పాటులు చేస్తూ ఉంటారు.
నేషనల్ పార్క్స్‌లో జంతువులను చూపించేందుకు సఫారీ కార్ల కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.ఈ అడ్వెంచర్‌ను ఎంజాయ్ చేసే యాత్రికులు అక్కడ కనిపించిన దృశ్యాలను వీడియోలు తీస్తూ ఉంటారు.అలా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక అడవి ప్రాంతంలో పులి, ఎలుగుబంటి మధ్య బికరమైన పోరాటం జరగడం ఆ వీడియోలో మనం చూడవచ్చు.ఈ జంతువులు చాలా తక్కువ సమయాల్లో ఎదురుపడినప్పుడు ఒకదానిపై ఒకటి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
అదే సమయంలో సహజంగా అయితే పులి దాడికి ఎలుగుబంటి కచ్చితంగా భయపడి పారిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు.కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా రివర్స్ లో జరిగింది.ఎలుగుబంటి పులికి సమానంగా దాడి చేయడంతో పులి అక్కడి నుంచి పారిపోవడం ఆ వీడియోలో చూడవచ్చు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజెన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.ఎలుగుబంటి ధైర్యానికి మెచ్చుకోవచ్చని కూడా కామెంట్లు చేస్తున్నారు.