నాకు అస్సలు భయం లేదు.. అర్ధరాత్రి గురించి దీప్తి సునయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

సోషల్ మీడియా సెలబ్రెటీ దీప్తి సునయన గురించి అందరికి పరిచయమే.బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది దీప్తి.

 I Am Not Afraid At All Deepti Sunayanas Interesting Comments About Midnight, Dee-TeluguStop.com

ఆ షోతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది.

బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.

మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Telugu Bigboss, Deepti Sunayana, Short Flims-Movie

ఇక దీప్తి మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.ఇక వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

దాంతో అది లవ్ గా మారింది.కానీ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.మొదట్లో బాగా ఎమోషనల్ అయిన దీప్తి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది.ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

తన నడుము అందాలతో తెగ స్టెప్పులు వేస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.

ఏదైనా కొత్త పాట వస్తే చాలు వెంటనే సందడి చేయకుండా ఉండదనే చెప్పాలి.

అప్పుడప్పుడు మనసుకు టచ్ అయ్యే కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.అవి ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కానీ అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది.

Telugu Bigboss, Deepti Sunayana, Short Flims-Movie

అందులో తను రాత్రిపూట నడవాలని అనుకుంటుందట.ఎందుకంటే తనకు భయం ఉండదట కానీ చిన్న సైజు భయం ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవడంతో.

చిన్న సైజు భయం ఏంటి అంటూ సరదాగా కౌంటర్లు వేస్తున్నారు.ఇక దీప్తి ప్రస్తుతం ఫోటో షూట్ లతో ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంది.

ఇక వెండితెరపై అవకాశాలు అందుకోవటం కోసం బాగా ప్రయత్నిస్తుంది.కానీ దర్శక నిర్మాతలను మాత్రం అస్సలు మెప్పించలేక పోతుంది.

చూడాలి మరి భవిష్యత్తులోనైనా దీప్తి సునయనకు అవకాశాలు వస్తాయే రావో అని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube