మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా టైటిల్ విషయమై గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.వాల్తేరు వీరన్న అనే టైటిల్ ని దాదాపుగా కన్ఫామ్ చేశారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
దర్శకుడు బాబీ కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లుగానే మాట్లాడాడు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు మరో టైటిల్ ని కన్ఫామ్ చేసేందుకు రెడీ అయ్యారు దీపావళి సందర్భంగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ఒక ఆసక్తికరమైన టైటిల్ ని ప్రకటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
సినిమా టైటిల్ విషయం లో ఉన్న సస్పెన్స్ కి దీపావళి సందర్భంగా తెరదించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో కొందరు మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ వాల్తేరు వీరన్న కంటే బెస్ట్ బెటర్ టైటిల్ ని దర్శకుడు బాబీ పెట్టగలడా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం ఖచ్చితంగా చిరంజీవి మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక మంచి టైటిల్ ని దర్శకుడు ఎంపిక చేసి ఉంటాడు అంటూ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా కీలక పాత్రలో రవితేజ నటించిన విషయం తెలిసింది.ఆయన ఈ సినిమాలో ఏదో ఇలా వచ్చే అలా వెళ్ళిన పాత్ర కాకుండా దాదాపుగా ముప్పావు గంట పాటు స్టోరీలో కనిపించబోతున్నాడట.కనుక ఇది కచ్చితంగా మల్టీ స్టార్ సినిమా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.