నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం డిసెంబర్ లో అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే, ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.అంతే కాకుండా ఈ మధ్య కాలంలో అత్యధిక థియేటర్స్ లో 50 రోజులు మరియు 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా కూడా అఖండ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా బాలకృష్ణ తన తదుపరి సినిమా ను కూడా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని అభిమానులు చాలా బలంగా కోరుకున్నారు.కానీ ఆయన మాత్రం డిసెంబర్ సెంటిమెంట్ నీ కోరుకోవడం లేదని తెలుస్తోంది.

గతంలో సంక్రాంతికి ఆయన నుండి వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే సంక్రాంతి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.నేడు సినిమా కు సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.బాలకృష్ణ మరియు శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కచ్చితంగా ఈ సినిమా నందమూరి అభిమానులకు మరో అఖండ విజయాన్ని తెచ్చిపెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను చాలా విభిన్నంగా బాలయ్య అభిమానుల అభివృద్ధికి తగ్గట్లుగా రూపొందించాడట.







