ఉయిగర్ ముస్లింలపై వేధింపుల అంశంలో తొలిసారి గళం విప్పిన భారత్

చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉయిగర్ ముస్లిం మైనారిటీలపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందన్న తీవ్ర ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.వారిని ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి హింసిస్తూ, చైనా తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 India Is The First To Speak Out About The Persecution Of Uighur Muslims-TeluguStop.com

ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు.

అంతేకాదు, చైనాకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం భారత్ కు ఉన్నా ఓటింగ్ కు గైర్హాజరైంది.ఈ ఓటింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత భారత్ స్పందించింది.

చైనాలోని ఉయిగర్ ముస్లింల అంశంపై తొలిసారి బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించింది.జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని, హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాలని భారత్ పిలుపునిచ్చింది.

సంబంధింత వర్గాలు ఈ అంశాన్ని తగిన రీతిలో పరిష్కరించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube