వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె చేపట్టిన “ప్రజాప్రస్థాన యాత్ర” శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఎన్నికలలో డబ్బులు ఇస్తే తీసుకోండి.
కానీ ఓటు మాత్రం మీ భవిష్యత్తు కోసం ఆరాటపడే పార్టీకి వెయ్యండి అని ప్రజలకు తెలిపారు.ఐదు సంవత్సరాల వైయస్సార్ పరిపాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని షర్మిల ప్రసంగించారు.
ప్రజల అవసరతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాల రూపంలో ఎన్నో మంచి పనులు చేశారని తెలిపారు.
ప్రతి పథకం ఆయన గుండెల్లో నుంచి వచ్చిందని అన్నారు.అందువల్ల వైయస్సార్ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదని.ఒకవేళ గ్యాస్ ధర కేంద్రం పెంచిన గాని ఆ టైంలో పెంచిన ధర ప్రభుత్వమే భరించింది.
ముఖ్యమంత్రి అంటే వైయస్సార్.తాను ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతా.
మహిళా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా.ఇంట్లో వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.
వైయస్సార్ టిపి పార్టీతోనే సంక్షేమ పాలన సాధ్యమని తెలియజేశారు.